Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు అనే సంస్కృతి సమాజంలొ నెలకొనడం బాలికల పాలిట శాపంగా పరిణమించింది. తల్లి గర్భంలో పెరుగుతున్నది ఆడ శిశువు అని తెలియగానే ''భ్రూణ హత్యలకు'' పాల్పడటం సర్వసాధారణ మైంది. పుట్టుక నుండీ, కుటుంబం నుండే ఆడ పిల్ల నిర్లక్ష్యానికీ వివక్షతకూ గురికావడం విచారకరం. పుట్టుకముందే ఆడపిల్లలు హత్య లకు గురవుతున్నారు. ఫలితంగా రోజు రోజుకీ ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది. 2011 గణాంకాల ప్రకారం 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలే ఉన్నారు. దేశంలో 26.5శాతం బాల్యవివాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో జరుగుతున్న బాల్యవివాహాల్లో 40శాతం మన దేశంలోనే జరుగుతున్నాయని యూనిసెఫ్ వెల్లడించింది. బాలికలకు ఉన్నత విద్య సమస్యగా మారింది. నేటికీ 40శాతం పైగా బాలికలు పదవతరగతి కంటే ముందే బడి మానేస్తున్నారు. వ్యవసాయరంగంలో అసం ఘటిత రంగంలో బాలకార్మికులుగా పని చేస్తున్నారు. శ్రమ దోపిడీకి, లైంగిక దాడులకూ బలవుతున్నారు. బాలికల భద్రత, హక్కుల రక్షణ పౌరసమాజం సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ఆడపిల్లలకు మగ పిల్లలతో పాటే అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించాలి. ఆడపిల్లల అభివృద్ధే దేశాభివృద్ధిగా భావించాలి. ప్రభుత్వాలు, పౌర సమాజాలు మహిళా సాధికారితకు ఉద్యమిం చాలి. ''ఆడపిల్లను పుట్టనిద్దాం.. బతుకనిద్దాం.. చదువనిద్దాం ఎదగనిద్దాం..'' అన్న నినాదం విథానమైనప్పుడే బాలికల దినోత్సవం ఆశయాలు నెరవేరుతాయి.
(నేడు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా)
- నేదునూరి కనకయ్య, 9440245771