Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంత మంది సర్పంచులు, కార్పొరేటర్లు అయితే చాలు.. 2 కార్లు, ఓ పది మందిని వెనకేసుకుని నానా హంగామా చేస్తూ కార్లలో తిరుగుతున్న కాలమిది. ఇక ఎమ్మెల్యేలు అయితే చాలు ఐదారు కార్లు, ఓ 50మందిని వెంటేసుకొని తిరుగుతున్న సందర్భం ఇది. ఇక మంత్రులు అయితే చెప్పక్కర్లేదు. ఇది నాణానికి ఒకవైపే. మరోవైపు కమ్యూనిస్టు ప్రజా ప్రతినిధులు దీనికి భిన్నమని మరో మారు నిరూపితమైంది. బెంగళూరు నగరంలో ఇటీవల ఐదు రోజులపాటు జరిగిన సిఐటియు 17వ మహాసభలకు కేరళ నుంచి ఇద్దరు మంత్రులు(శివన్ కుట్టి, వాసవన్) జార్ఖండ్ నుంచి మరో మంత్రి(బాబుబస్రే) హాజరయ్యారు. ఆ ముగ్గురు తాము మంత్రులమనే దర్పణాన్ని ఎక్కడా ప్రదర్శించలేదు. అందరి ప్రతినిధుల మాదిరిగానే తమ రాష్ట్రం వారికి కేటాయించిన ఆర్టీసీ బస్సుల్లోనే మహాసభల ప్రాంగణానికి రోజూ వెళ్లారు. తమ రాష్ట్రానికి కేటాయించిన స్థలంలోని సీట్లలోనే ఆసీనులయ్యారు. తమకిచ్చిన వసతిలోనే నిద్రించారు. వారి వెంట గన్మెన్లు కానీ, కార్లు గాని లేకపోవడం గమనార్హం. ఓ కమ్యూనిస్టు మంత్రులారా మీ సాధారణ జీవన విధానానికి హాట్సాఫ్.
- అచ్చిన ప్రశాంత్