Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా హీరోలు, హీరోయిన్లు బయట కనిపిస్తేచాలు... చూసేందుకు వేలాది మంది గూమిగూడటంతో ఆ తొక్కిసలాటలో అపశృతులు జరిగేవి. ఒక్కోసారి మరణాలు కూడా సంభవించేవి. ఇటీవల రాజకీయ నాయకుల పర్యటనల్లోనూ ఈ అపశృతులు దొర్లుతున్నాయి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లిన సందర్భంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సభలకు జనం కిక్కిసిరిపోవడంతో ఐదారుగురు ప్రాణాలు కోల్పోయారు. అది కాస్త రాజకీయ వివాదమైంది. డబ్బులు, చీరెలు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టడంతో జనం భారీగా తరలి వచ్చారనే విమర్శలొచ్చాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా ఓ ఎమ్మెల్యే గుండెపోటుకు గురై మరణించారు. మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో హీరో తారకరత్న తీవ్రమైన గుండెనొప్పితో బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమించిందని డాక్టర్లు హెల్త్‌బులిటెన్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చేందుకు అనేక వ్యయ ప్రయాసలకొర్చి పాదయాత్రలు, బస్సుయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటే, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండటంతో రాజకీయ నాయకులు ఉలికి పడుతున్నారు. ఇలాంటి విషాదభరిత సంఘటనలతో ప్రజల్లో అదరణ పొందటమేమోగానీ, నాయకులు మాత్రం ఒకింత ఆందోళనకు గురి అవుతున్నారు. ముహుర్తాల ఆధారంగా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునే నాయకులకు ఇలాంటి ఘటనలు చేదు గుళికలే..!
- గుడిగ రఘు