Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బురుజుల మీదా,
కోటగోడల మీదా,
అద్భుతమైనశిల్పాలమీదా,
తరాల తరబడి నిలబడిన వారసత్వ నిర్మాణాల మీదా..
చదువుగాకుండా కేవలం
అక్షరాస్యత కలిగిన
ఆకతాయి కుర్రాళ్లు తమ
పేరుని, ప్రియు రాలి
పేరునీ, తోటి సావాసగాళ్ల
పేర్లనీ పక్కన కన పడిన
రాయో, రప్పో తీసుకుని
చెక్కుతూ ఉంటారు.
నిజానికి అదివాళ్ల
సొంతమని చెక్కరు.కేవలం
తమ ఉనికిని గుర్తించమని
చెక్కు తారు.నిజానికి వాళ్లు
అక్కడ నుంచి కదిలిపోయిన
మరు క్షణమే వాళ్లేవరో
కూడా ఎవరికీ తెలియదు.
వాళ్లకి చరిత్ర తెలి యదు,
వారసత్వం తెలి యదు,
నాగరి కత, సంస్కృ తులు
తెలియదు, కనీసం శ్రమ
విలువ కూడా గుర్తించలేరు!
మనకు నిర్మించడానికి చేత
కానప్పుడు, నిర్మించిన దానిమీద మనపేరు
రాసు కుని, తద్వారా దాని
విలువని పతనం చేస్తున్నా
మనే కనీస స్పృహ లేకుండా
గుర్తింపు పొందాల నుకోవడం
ఆకా తయితనం, బాధ్యతా రాహిత్యం, దిగ జారుడుతనం.
- సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్