Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా దేహం ఇంకా బూడిదవ్వలేదు
నా సజీవ ఆశమీద నిప్పంటించినోళ్ళు
వున్న చోట ఆర్పేసేవాళ్ళొచ్చే వరకు
నాలో దేశమంతా వొక ఉడుకుతున్న
పాట నెత్తుకొని తిరుగుతుంటుంది.
నన్నేమీ అనకండి
నన్ను నేనే వెతుక్కుంటున్నా తరుణమిది.
తుంపలు తుంపలుగా రాలుతున్న
ఊపిరిని పోగుచేస్తుకుంటూ
నాలో నేనే తల దాచుకుంటున్న.
నన్నేమి అడగకండి
నేను నాలాగే వున్న
మసక మసక చీకట్లో
వెలుగుతున్న నన్ను
ఎవరో ఆన్ ఆఫ్ చేస్తూ
స్విచ్చాఫ్ చేస్తున్నారు.
నన్ను నమ్మండి
నేను మనిషివైపే నిలబడ్డాను
నాలో మనుషులే
కనుగుడ్లను వణుకుతూ
కింద పడేస్తూ, నెత్తిమీదకి జరుపుకుంటున్నారు.
ఇది కల కాదు భయాలపొరమీద
పంటిగాయాల వాస్తవం.
మనుషుల్ని కాలుతున్నఇనుపసువ్వలు
మింగాలని చూస్తున్న కాలం.
నన్నేమీ అనకండీ
నేను నిలబడే వున్నాను
నాతో నిలబడేవారే
సీసాలదేహాల్లోకి జారీ మూతులు,
మూతల్ని బిగించుకుంటున్నారు.
పగిలిపోకుండా వుంటారా?
నేను ఇంకా కూలిపోలేదు
నన్ను ఎత్తుకొని మరేవరినో పాడేంత కాలం
నేను నాలా కనిపించకపోవొచ్చు
నన్ను నమ్మండి ఈ దుఃఖపుపొరమీద
ఉడుకుతున్న పాటని
రేపోక పూలచెట్టునవుతాను
నాలోఎన్ని వాస్తవాలు పూస్తాయో చూడు.
- పేర్ల రాము, 9642570294