Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదానీ కంపెనీ షేర్లు ఆకాశం నుండి పాతాళానికి, అదానీ రెండోస్థానం నుండి పదోస్థానం దిశగా పతనమార్గం పట్టాడు. తద్వారా భారత బ్యాంకులతో సహా ఆర్థిక వ్యవస్థ కూడా సంక్షోభానికి గురతామన్న ఆందోళనకు గురయ్యారు భారతీయులు. మెకన్జీ నివేదికకు కౌంటరుగా 'ఇది నామీద కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీదనే దాడి' అని, ఇది మెకన్జీవారి బూటకపు నివేదికనీ, ఈ సంస్థను అంతర్జాతీయ న్యాయస్థానం బోనులో నిలుపుతామంటూ ఎదురుదాడికి దిగాడు అదానీ! అయినా సరే ఆయన స్థానం, కంపెనీల షేర్లు పతనమార్గాన జారుతూనే ఉన్నాయి. అతనేమైతే ఎవరికేం గాని, అతని షేర్లు గొన్న కొన్న ప్రజలు, అప్పులిచ్చిన బ్యాంకులు, ఎల్ఐసీ, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు మునుగుతాయోనన్న భయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి! అయినా ప్రధాని నోరు విప్పటం లేదెందుకని? ఈ విషయంలోనే కాదు, నాటి గుజరాత్ మారణకాండకు మోడీ, అమిత్షాలనే ప్రధాన కారకులుగా చూపుతున్న బిబిసి వీడియోను గూర్చికూడా నోరు విప్పటం లేదు మోడీ, షాలు!బీజేపీ మాత్రం ఇది మోడీ మీద చేస్తున్న దాడికాదు, భారతదేశం మీద దాడి అని చెబుతోంది. మోడీ షాలకు క్లీన్చిట్ ఇచ్చిన భారత సుప్రీంకోర్టు మీద బిబిసి చేస్తున్న దాడి పేర్కొంటోంది. అసలు బిబిసి విశ్వసనీయ సంస్థే కాదు, ఆ వీడియోను పట్టించుకోవాల్సిన పనేలేదు, రానున్న ఎన్నికల్లో మోడీని ఓడించటానికి జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో భాగమిది అంటూ ఎదురు దాడికి దిగుతోంది. కానీ బిబిసి వారి మంచి కౌంటర్నే ఇచ్చింది.' ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదు. నాడు మీరు తొక్కిపెట్టిన వీడియో క్లిప్పింగులను వెలికి తీసి యథాతథంగా రూపొందించిన వీడియోనే ఇది.' చెప్పింది. సాక్షులను, సాక్ష్యాధారాలను కోర్టుముందుకు రాకుండా నిర్బంధించినప్పుడు, సుప్రీం కోర్టు అయినా ఏం చేయలేకనే క్లీన్చిట్ ఇచ్చిందని,అంత మాత్రాన నేరం ఎలా మాసిపోతుంది? అని గట్టిగానే ప్రశ్నించింది. భారతదేశ మంటే తమకు సదాగౌరవమే. అలాంటి ప్రజాస్వామ్య దేశంలో కూడా గుజరాత్ మారణకాండ వంటి దారుణాలు ఎలా కప్పెట్టబడతాయో, ప్రజలకు, ప్రపం చానికి తెలియజెప్పడం కోసమే ఈ వీడియోను విడుదల చేసినట్టు చెప్పింది.
గుజరాత్ మారణకాండ..బీబీసీ నిజాలు
ఈ నేపథ్యంలో భారతీయులు కూడా గతాన్ని మననం చేసుకుంటున్నారు. గుజరాత్ మారణకాండ నేపథ్యంలో, తన పక్కనే ఉన్న మోడీ సమక్షంలోనే, ''గుజరాత్ దుస్సంఘటన విషయంలో మోడీ రాజధర్మాన్ని పాటించలేదని'' మీడియా ముందే అన్న నాటి ప్రధాని వాజ్పేయి మాటలు. గత గుజరాత్ ఎన్నికల సభలో ''రాష్ట్రంలో అల్లర్లకు కారకులైనవారికి గతంలో మనం గుణపాఠాన్ని చెప్పాం. దాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే అదే గుణపాఠం మరోసారి పునరావృతమవుతుంది'' అన్న అమిత్షా మాటలూ సదరు మారణకాండకు బాధ్యులు, మోడీ అమిత్షాలేనని తెలియజేస్తున్నయి గదా! బ్రిటిష్ ప్రభుత్వ నిధులతో నడుస్తున్నదైనా, పారదర్శకంగా వ్యవహరిస్తూ, ప్రపంచ విశ్వస నీయ ఛానెళ్ళలో బిబిసి ఒకటని మేధావులు వక్కాణిస్తున్నారు! అందుకు నిదర్శనాలెన్నో ఉన్నాయి. బ్రిటిష్ వలస పాలనలో భారత్లో ముఖ్యంగా బెంగాల్లో సంభవించిన కరువుకు లక్షలాది భారతీయుల మరణ దృశ్యాలను చిత్రించి అందుకు నాటి బ్రిటిష్ ప్రధాని చర్చిల్నే ప్రధాన బాధ్యుడని నిర్భయంగా చెప్పింది బిబిసి! ఇందిరాగాంధీ హయాంలో నిర్బంధానికి గురై, భారతీయ మీడియా మౌనం వహించిన - ఎమర్జెన్సీ దురాగతాలను, భారతీయులతో సహా ప్రపంచ మంతా తెలుసుకోగలిగింది బిబిసి ద్వారానే. నాడు ఇందిర వ్యతిరేక పార్టీల కూటమిలో చేరిన బీజేపీ, ఆరెస్సెస్ నేతలు బిబిసిని ఆకాశానికెత్తారు. సాక్షాత్తూ నరేంద్ర మోడీనే ఒక ఎన్నికల సభలో ''భారతీయ దూరదర్శన్ కన్నా బిబిసి ఎన్నోరెట్లు విశ్వసనీయ మైంద''ని ప్రశంసించాడు. మరి నాడు 'ఇందిరయా'గా నేడు 'మోడియా'గా మారిన భారతీయ మీడియా చెప్పలేని నిజాలను బిబిసి ద్వారా తెలుసుకోవటం జాతి విద్రోహమా మోడీ ''అవినీతి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదికారి అన్నదే మోడీ ప్రభుత్వ భావన!'' అని రాష్ట్రపతి పార్లమెంట్లో చేసిన ప్రసంగం!...''అవినీతిని ఎంతమాత్రం సహించకండి! ఆత్మరక్షణలో పడక, నిర్భయంగా దాడులు చేయండి!'' అంటూ దర్యాప్తు సంస్థల్ని మీరు ఆదేశిస్తున్న మీడియో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గదా! మరి అదానీ వ్యాపారాలపై దర్యాప్తు సంస్థల చేత దాడులు చేయించి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. లేదా ''మెకన్జీసంస్థ వారి నివేదిక'' అబద్ధమనీ, అదానీవి డొల్లకంపెనీలు కావు, వాటివల్ల బ్యాంకులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమేలేదని'' మీడియా ముఖంగా ప్రకటించైనా ప్రజలకు భరోసా కలిగించండి!.మరి ఎందుకు మౌనంగా ఉంటున్నారు?దాని మర్మమెంటో దేశ ప్రజలకు తెలుసులే మోడీజీ.
- పాతూరివెంకటేశ్వరరావు
8949081889