Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నాకేం కాలేదు'' అంది అతి పెద్ద సర్కారీ బ్యాంకు!
''నాకూ ఏం కాలేదు!'' అంది సర్కారీ ఇన్సూరర్
''నాకు గాయమైందన్నా''డు పే..ద్ద సర్కారీ పెట్టుబడిదారు!
''ఎవడ్రా రాయేసింది?'' సర్కారు ప్రశ్న!
''విదేశీ శక్తి!'' రాష్ట్రీయ స్వదేశీ సంఘం సమాధానం
''ఎందుకేశాడు?''
ఐదు బిలియన్ డాలర్ల వ్యవస్థను చూడలేక!
అదెప్పుడొస్తుందన్నారు ప్రజలు!
''కుంభమేళా టైమ్‌లో!'' అంది సర్కారు.
''ఆహా! దగ్గరకొచ్చేసిందిగా!'' ఆనందంతో జనం!
''నో... నో! నెక్ట్స్ కుంభమేళాకి!'' కూల్‌గా నిటి అయోగ్!
''అయ్యో! 2035 దాకా ఆగాలా?'' నిట్టూరుస్తూ.. మళ్ళీ జనమే!
''రాహు, కేతువులు 'సూర్యుణ్ణే'
నోట కరుచుకుంటే ఎలావస్తుంది?'' మళ్ళీ సర్కారు ప్రశ్న!
అద్గదిగో..! దూరంగా ఆ గుంపేంట్రా కొత్వాలూ?
ఆ! 2024 దగ్గరికోస్తోంది కదా!
గొర్రెల మందయ్యుంటుంది రాజా!
కాదు, కాదు... అవి చీమలే! సారూ!
ఎర్ర చీమల్రా నాయనా!
బంగారు పుట్ట ధ్వంసమై
కసిగా ఉరికొస్తున్నాయి!
- ఆరెస్బీ