Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రవహించే ఉత్తేజం..
నిత్య చైతన్య గీతం,
యువకిషోరం.. స్ఫూర్తి ప్రధాత..
కణకణమండే న్పిుపకణిక,
నింగికెగసిన అరుణతార
అమరుడా కామ్రేడ్ నరసింహ.
జోహర్లు కన్నీటి నివాళులు..!
ఉద్యమాల అడ్డ...
వీపనగండ్ల పోరుగడ్డలో
పుట్టిండు పులిపిల్లడు...
ఈమట్టి నవయవ్వనమైంది.
ఉదయించే సూర్యుడు,
ఉద్యమాల భాస్కరుడు..!!
కటికదరిద్రుల పాలిట
క్రాంతి కిరణం,
మట్టిమనుషుల ఎదలు తట్టే వేగుచుక్క..
బువ్వలేక డొక్కలెండి
ఆకలితో తనువులు
చాలించే బతుకులకు
అంబలిపోసి
ఆయుషు పెంచిన ఆప్తుడు.
అగ్రవర్ణ దురహాంకారనెదిరిస్తూ,
ఎట్టిబతుకుల మెతుకుల కోసం..
సమసమాజమే లక్ష్యంగా,
సమరశంఖం పూరించిన రణధీరుడు..
కపటదారి నక్సల్స్ ముష్కరుల
బాంబు వేటుకు బలైన దృవతార..!!!
ఆనెత్తుకి గాయాలతో దండుగట్టి,
నడకలోఎర్రని జెండాలెత్తుకుంటూ..
మా అన్న ఎక్కడని,
నినుకన్న పల్లె కన్నీళ్లు కారుస్తుంది..
పాడేటి కోయిల పాట మూగబోయింది..
ఆడేటినెమళ్లు నాట్యమాపాయి.
చిన్నారి నవ్వులో
చిరునవ్వు నిలిచింది.
కొమ్మారెమ్మా చిగురించలే..!!!!
ఉద్యమంలాఎగిసిన తార,
పొద్దుపొడుపై నిలిచే వీరా..
నింగినేలలో వెలిగే దృవతార,
నిత్య చైతన్యపు దారా..
నీ నమ్మిన ఆశయం... సిద్ధాంతం
సాగరకెరటమై
ఎగసిపడుతున్నయి...
ఇలలో అలలై .!!!
(కామ్రేడ్ నరసింహ
32వ వర్థంతి సందర్భంగా)
- డి. కృష్ణయ్య, వీపనగండ్ల.