Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక గిరిజన కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాన్ని అధిరోహించి బంగారు భవిష్యత్తు మంచి జీవితాన్ని గడపవలసిన ఒక గిరిజన బిడ్డ సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల వల్ల మరణించడం చాలా బాధాకరం అమె మరణం ఆ కుటుంబానికి గిరిజన సమాజానికి తీరని లోటు. ఈ అమ్మాయి మరణం వెనుక ఉన్న ఇటు కుటుంబం పరంగా చట్టాల పైన అవగాహన కలిగిన పోలీసు ఉద్యోగి అయిన తన తండ్రి, మంచి విద్యా వంతులైన తన కుటుంబ సభ్యులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఒక అమ్మాయి ఇంత దారుణమైన మరణానికి పాలు కావడానికి గల కారణాలేంటి? కళాశాలలో అమలుపరుస్తునా నియమ నిబంధనలేంటో పరిశీలిద్దాం... ప్రభుత్వం నియమ నిబంధనలు సుప్రీం కోర్టు సూచనల ప్రకారం ప్రతి కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షలను నిర్వహించాలి. కఠినమైన శిక్షలను విధించే అధికారం కూడా కళాశాల ప్రిన్సిపాల్‌కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి కళాశాలలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ తరచుగా సమావేశాలు కావాలి. సమస్యలను కనుక్కోవడం వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించడం, సమస్య మళ్లీ పునరావృతం కాకుండా చూడడం కమిటీ సభ్యుల బాధ్యత. ఇంకా అమ్మాయి ఎస్సీ ఎస్టీ చట్టం కింద కూడా తనకు జరిగినటువంటి సాధక బాధలను చెప్పుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కళాశాలలో విమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఉంటుంది. ఇక్కడ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కళాశాలకు మరిన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్రమశిక్షణ పేరిట రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని నిబంధనలు, ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించిన అమ్మాయి వేధింపులకు గురై చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్‌పై నియమ నిబంధనలను పర్యవేక్షిస్తున్నాడా లేదా అమ్మాయి ఫిర్యాదు ఇచ్చినట్టు అది మౌఖికంగా కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు, వాటి పైన చర్య తీసుకున్నాడా లేదా? ఇవన్నీ పరిశీలించాల్సిన అంశాలే. ఇంతకీ ఆ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్‌లు తరుచుగా జరిగాయా లేదా చూడాలి. అమ్మాయిల పైన జరిగే వేధింపులకు ఇంతవరకు ఎప్పుడైనా కేసులు నమోదు అయ్యాయా? అనేది ప్రభుత్యం ఆలోచించాలి. చూసీ చూడనట్టు ఉండకుండా ఈ చట్టాలు, నియమ నిబంధనల ప్రకారం ఆయా కళాశాల సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించారా లేదా అనే కోణంలో కూడా విచారణ చేయాలి. అన్నింటిని పరిశీలలించిన తర్వాత నిందితులకు తగిన శిక్ష విధించేలా చూడటంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పుడు కళాశాలలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు గురికాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఈ సంఘటన జరిగిన తర్వాత సానుభూతి తెలపడం కాదు సంఘటన జరగకుండా పిరియాడికల్ రివ్యూ మీటింగ్ జరుగుతున్నాయా లేదా అనే దానిపైన ఫోకస్చేయాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుని బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులను సమాజానికి అందించాలి. పాలకులు, అధికారులు ఉన్నత విద్యావ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. ప్రీతిలాంటి మరణాలు పునరావృతం కాకుండా చూడాలి.
- డాక్టర్ శంకర్ నాయక్, సెల్:9110716674