Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలోని ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సియు)లో 2022-23 గుర్తింపు విద్యార్థి సంఘం ఎన్నికల్లో మతోన్మాద శక్తులను మట్టికరిపించి భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) వామపక్ష, సామాజిక శక్తుల కూటమి విజయం సాధించింది. జిఎస్కాస్ ఫ్యానెల్‌తో సహా ప్రధాన ఆఫీస్ బేరర్స్ పోస్టులను భారీ మెజా రిటీతో కైవసం చేసుకుంది. మూడున్నరేండ్ల తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో విద్యార్థులు వామపక్ష కూటమి వైపు నిలవడం మంచి పరిణామం. దేశంలో నయా ఉదారవాద, ఫాసిస్టు పాలన నడుస్తున్న ఈ కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ కూల్చుతున్న సమయంలో హెచ్సీయులో ఎస్ఎఫ్ఐ నేతృత్వంలోని కూటమి విజయం సమాజంలో ప్రగతిశీల శక్తులకు ఆశాజ్యోతిని అందించింది. ఈ కూటమికి హెచ్‌సియులో అన్ని వర్గాల విద్యార్థులు మనస్ఫూర్తిగా మద్దతును అందించారు. అన్ని పోస్టులకు సగటున ఈ కూటమి 600పైగా ఓట్ల మెజారిటీతో గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్(ఎ.ఎస్ఎ), దళిత స్టూడెంట్స్ యూనియన్(డి.ఎస్.యు.) కలిపి ఎస్ఎఫ్ఐ క్యాంపస్ ప్రజాస్వామ్యం కాపాడడానికి ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఎబివిపిని ఓడించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ కూటమిలో అత్యంత ప్రగతిశీలమైన అభ్యర్థులు సామాజికంగా అట్టడుగున ఉన్న ఓబిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ప్రాతినిధ్యానికి దించింది. యూనివర్సిటీ చరిత్రలోనే ఇద్దరు దళిత క్వీర్ వ్యక్తులను అధ్యక్షుడు(ప్రజ్వల్ గైక్వాడ్), జిఎస్ కాస్ (పిజీ) ప్రతినిధి (హృతిక్ లక్ష్మణ్ లలన్)లు ఈ కూటమిలో ప్రధాన పోస్టుల్లో పోటీలో నిలిపింది. యూనివర్సిటీ చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ జనరల్ సెక్రటరీగా ఎస్ఎఫ్ఐ నుంచి కృపా మరియా జార్జ్ ఎన్నికవడం సంతోషిం చాల్సిన అంశం.
ఎస్ఎఫ్ఐ, ఎబివిపి
కూటముల మధ్యే ప్రధాన పోటీ..
హెచ్‌సియు ఎన్నికల్లో ఈ సారిమొత్తం నాలుగు ఫ్యానెల్స్ పోటీలో ఉన్న ప్రధాన పోటీలో ఎస్ఎఫ్ఐ, ఎబివిపి కూటమిల మధ్యనే జరిగింది.ప్రధానంగా ఎన్నికల బరిలో ''ఎస్ఎఫ్ఐ, ఎ.ఎస్.ఎ,డి.ఎస్.యు'' ఒక కూటమిగా నిలిచింది. ఎబివిపి, అదర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్(ఓబిసిఎఫ్)-సేవాలాల్ విద్యార్థిదళ్(ఎస్.ఎల్.వి.డి) ఒక కూటమిగా ఏర్పడింది. బిఎస్ఎఫ్, ఎన్.ఎస్.యు.ఐ, ట్రైబల్ స్టూడెంట్స్ ఫ్రంట్, ముస్లీం స్టూడెంట్స్ ఫెడరేషన్, ఎస్.ఐ.ఓ. కలిపి అలయెన్స్ ఫర్ సోషల్ డెమోక్రటిక్(ఎఎస్డీ) ఒక కూటమిగా పోటీలో ఉంది. ఎఐఎస్ఎ, వైఐఎస్ఎస్లు అధ్యక్ష, సహాయ కార్యదర్శి, ఉపాధ్యక్ష, స్థానాలకు ఒక కూటమిగా పోటీలో నిలిచాయి. మొత్తం యూనివర్సిటీలో 5133 ఓట్లకు గాను 3925 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 76శాతం ఓటింగ్ జరిగింది. ఇందులో ప్రధానమైన అన్ని పోస్టులు ఎస్ ఎఫ్ఐ కూటమి సొంతం చేసుకుంది.
అడ్మినిస్ట్రేషన్ ఆటంకాలు
గతంలో నిర్వహించిన ఎన్నికల్లోనూ ఎస్ఎఫ్ఐ విజయం సాధించింది. ఆ కార్యకలాపాల నివేదికను యూనివర్సిటీ జనరల్ బాడీ మీటింగ్(యుజీబిఎం) ద్వారా విద్యార్థులకు వివరించాలి. అత్యంత ముఖ్యమైన ఈ సమా వేశాన్ని యూనియన్ అధ్యక్షుడు అభిషేక్ రిపోర్ట్ ప్రవేశ పెట్టకుండా ఎబివిపి అడ్డుకుంది. ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై, స్టూడెంట్స్ యూనియన్‌పై భౌతిక దాడులు చేయాలని ఆరాచకం సృష్టించింది. యుజీబిఎం జరగ కుండా హంగామా చేసింది. అయినా విద్యార్థులు ఎబివిపికి వ్యతిరేకంగా నిలబడి యుజీబిఎం నిర్వహించారు. అడ్డు కోవాల్సిన అడ్మిని స్ట్రేషన్ కూడా ఎబివిపి చెప్పినట్లు తలొగ్గాల్సి వచ్చింది. మొదటి సంవత్సరం విద్యార్థులు తమ సెమి స్టర్ పరీక్షలు పూర్తి చేసుకుని సెలవులకు వెళ్తారు. ఎన్నికల తేదీని పొడగించండని అని పది విద్యార్థి సంఘాలు సమావేశమై (ఎబివిపి మినహా) విన్నవించినా అడ్మినిస్ట్రేషన్ కాషాయ సంఘానికి అనుకూలంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమై నోటిఫికేషన్ ఇచ్చింది. కొంత మంది నూతన విద్యార్థులు ఓటును వినియోగించుకోకుండా ఎన్నికల కమిషన్ ఎబివిపికి సాధనంగా మారి బలవంతంగా ఎన్నికలను ప్రయోగించింది. ఒకే రోజులో నామినేషన్లు వేయడానికి గడువు, మరు సటిరోజు ఉపసంహరణ, మరో మూడురోజులు ప్రచారానికి మాత్రమే అవకాశం కల్పించింది. ఎబివిపి క్యాంపెయిన్‌కు విద్యార్ధులు హాజరుకావాలని మెయిల్స్ పంపింది. ఎన్నికల నిబంధనలలో ర్యాలీలు నిషేధం ఉన్నప్పటికీ ఎబివిపికి ముందురోజు ర్యాలీకి అనుమతి ఇచ్చింది. ఈ అన్ని సందర్భాలలో ఎబివిపికి అనుకూలంగా ఎస్ఎఫ్ఐ కూటమికి వ్యతి రేకంగా ఎన్నికల కమిషన్ పక్షపాతం చూపింది. పోలింగ్ జరిగిన రాత్రి కూడా కూటమి పోస్టర్లు చించడమే కాకుండా మద్యం తాగి ఎబివిపి నాయకులు ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై దాడులకు పాల్పడారు. వారికి వారే గాయాలు చేసుకుని పైగా ఓట్లు వేయలేదని ఎస్ఎఫ్ఐ నాయకులే తమపై దాడి చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. ఆడ్మిన్, ఎబివిపి ఎన్ని దాడులు చేసినా కూటమి నాయకులు బలంగా నిలబడి ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పోరాటం చేశారు. తిరుగులేని ఎన్నికల ఫలితాల ద్వారా ఎస్ఎఫ్ఐ కూటమిని గెలిపించిన విద్యార్థులు తాము ఫాసిస్టు మూకల నుండి క్యాంపస్‌ను రక్షించు కుంటామనే సంకేతాలు పంపారు. దీనికి వామపక్ష, ప్రజాస్వామ, సామాజిక కూటమికి నాయకత్వం అప్పగిస్తున్నామని ఓటుతో చెప్పారు. నూతన విద్యావిధానం ద్వారా విద్యను సరుకుగా మార్చడం, మతో న్మాద భావాలను చొప్పించే వారికి ఇక్కడ స్థానం లేదని హెచ్‌సియు విద్యార్థులు నిరూపించారు. వారు నమ్మకంతో ఎస్ఎఫ్ఐ కూటమి మీద పెట్టిన బాధ్యతను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. పదవుల్లో ఉన్నా లేకున్నా యూనివర్సిటీ సమస్యలపై నిరంతరం పోరాడుతాం. అసమాన విజయాన్ని అందించిన విద్యార్థిలోకానికి జేజేలు.
- టి. నాగరాజు
9490098292