Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏం ఆలోచిస్తున్నావు!' అన్నాడు యాదగిరి.
'ఏం లేదు!ఇలాంటి పని అంబానీ, అదానీ కోసం ఎందుకు చేయడం లేదు' ఆలోచిస్తున్నాను అన్నది లక్ష్మి. 'ఎప్పుడూ అంబానీ, అదానీల మీదపడి ఏడ్వడమేనా? వారేమన్నా పాకిస్తాన్, చైనాకు చెందినవారా?ఈ భూమిపుత్రులేకదా! వారు బాగుపడితే ఈ దేశం బాగుపడుతుందని తెలుసుకోండి'!అన్నాడు ఆవేశంగా యాదగిరి! 'ఆవేశం తగ్గించుకోండి శ్రీవారు! అంబానీ, ఆదానీలు ఈ భూమిపుత్రులే కాదనను!మరి సిలిండర్ కొనేవారంతా పాకిస్తాన్, చైనా దేశస్తులా! మనమంతా ఈ భూమి పుత్రులం కాదా? ప్రశ్నించింది!లక్ష్మి.
'ఏంటోరు! ఏమి టిఫిన్ చేస్తున్నావు!' అన్నాడు యాదగిరి
పాత సినిమాల్లో శోభన్‌బాబులా.
'ఇడ్లీలు చేస్తున్న శ్రీవారు!' అంటూ బదులిచ్చింది లక్ష్మి.
తను కూడా పాత సినిమాల్లో జయసుధలా!
'అబ్బ! నాకిష్టమైన టిఫిన్ చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు!' అంటూ వచ్చి కూర్చున్నాడు యాదగిరి.
'ఇదిగో కానివ్వండి! అంటూ టిఫిన్ ప్లేటు యాదగిరి ముందు పెట్టింది!లక్ష్మి.
ప్లేటుని తేరిపార చూశాడు యాదగిరి! ఎంత చూసినా ఇడ్లీలు కనబడలేదు! పొంగణాలు మాత్రమే కనబడుతున్నాయి.
'ఏంటోరు!ఇడ్లీలు అని చెప్పి పొంగణాలు పెట్టావు'! అన్నాడు యాదగిరి.
'అవి పొంగణాలు కావు ఇడ్లీలే! సరిగ్గా చూడండి!' అని బదులిచ్చింది లక్ష్మి.
యాదగిరి మళ్లీ ప్లేటు వంక చూశాడు. అనుమానం వచ్చి పట్టుకుని చూశాడు. నిజమే అవి ఇడ్లీలే! అయతే సైజు తగ్గింది! అందుకే పొంగణాలు మాదిరి కనబడ్డాయి!
'ఎందుకూ! ఇడ్లీల సైజు తగ్గించావు!' అన్నాడు యాదగిరి ఆశ్చర్యంగా.
'ఇడ్లీల సైజే కాదు! అన్నింటి సైజు తగ్గింది!' అంటూ భోజనం క్యారియర్ తెచ్చి యాదగిరి ముందు పెట్టింది.
అది చూసి యాదగిరి కళ్లు తిరిగాయి. నానిగాడి క్యారియర్ కన్నా చిన్నగా ఉన్నది.
'ఇంత చిన్న క్యారియర్‌తో ఆకలి ఎలా తీరుతుందీ!
పని ఎట్లా చేతనవుతుంది!' నీరసంగా అన్నాడు యాదగిరి
'సిలిండర్ ధర పెరిగింది! సర్దుకోవాలి తప్పదు!' అన్నది లక్ష్మి.
'భోజనం తక్కువైతే ఎట్లా సర్దుకునేది'? మళ్లీ అడిగాడు యాదగిరి.
'గతంలో ఉన్న ధరతో సిలిండర్ కొంటే రెండు నెలలు వచ్చేది. ఇప్పుడు పెంచిన ధరతో సిలిండర్ మూడు నెలలు వస్తేనే సరిపోతుంది' అన్నది లక్ష్మి.
యాదగిరి కళ్లలో మెరుపులు కనిపించాయి. చిన్నగా నవ్వాడు.
'ఎందుకా నవ్వులు? ఏమా మెరుపులు?' అన్నది లక్ష్మి విసుగ్గా
'చూశావా! మా మోదీ ఘనత! నీలాంటి మధ్య తరగతి మహిళలందరికీ పొదుపు చేయడం నేర్పించాడు!అన్నాడు యాదగిరి.
'భర్త మాటలకు లక్ష్మి షాక్ తిన్నది! మరీ ఇంత మూఢ నమ్మకమా? అనుకుంది!
'ఏం ఆలోచిస్తున్నావు!' అన్నాడు యాదగిరి.
'ఏం లేదు!ఇలాంటి పని అంబానీ, అదానీ కోసం ఎందుకు చేయడం లేదు' ఆలోచిస్తున్నాను అన్నది లక్ష్మి.
'ఎప్పుడూ అంబానీ, అదానీల మీదపడి ఏడ్వడమేనా?
వారేమన్నా పాకిస్తాన్, చైనాకు చెందినవారా?ఈ భూమిపుత్రులేకదా! వారు బాగుపడితే ఈ దేశం బాగుపడుతుందని తెలుసుకోండి'!అన్నాడు ఆవేశంగా యాదగిరి!
'ఆవేశం తగ్గించుకోండి శ్రీవారు! అంబానీ, ఆదానీలు ఈ భూమిపుత్రులే కాదనను!మరి సిలిండర్ కొనేవారంతా పాకిస్తాన్, చైనా దేశ స్తులా! మనమంతా ఈ భూమి పుత్రులం కాదా?
ప్రశ్నించింది! లక్ష్మి.
'సిలిండర్‌కి పెట్టేధర అంబానీలకు, అదానీలకు చేరుతుందా ప్రభుత్వానికే కదా! నాకు జీతం పెరగొచ్చు కాని! నేను సిలిండర్ ధర పెరిగితే భరించకూడదా? ఆదాయపన్ను ఒక వెయ్యి ఎక్కువ కట్టకూడదా? ధరలు పెంచితే అది నేరమా? ప్రశ్నించాడు యాదగిరి.
'అబ్బో శ్రీవారి ఆర్గ్యుమెంటు చాలా పవర్‌పుల్‌గా ఉంది!తట్టుకోలేకపోతున్నాం గాని! మన భారతనారీ, బహు స్మృతీజీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిలిండర్ ధర పెరిగితే నడిరోడ్డు మీద ధర్నాలు చేశారు!కదా! ఎందుకంటారు? తిరిగి ప్రశ్నించింది!
'అదీ..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పవు కదా! తేలిగ్గా అన్నాడు యాదగిరి.
'ఓహో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెరిగే ధరలకు వ్యతిరేకంగా పోరాడుతారు! అధికారంలోకి వచ్చాక మీరే ధరలు పెంచుతారు! మళ్లీ దాన్ని సమర్థించుకుంటారు! మీరు చాలా లాజిక్ అండీ!'దీన్ని తెలుగులో ఏమంటే బాగుంటుంది చెప్పనా' అడిగింది లక్ష్మి
యాదగిరి గర్వంగా కాలర్ సర్దుకుంటూ 'చెప్పవోరు' అన్నాడు.
'నయవంచన' అంటారు అన్నది లక్ష్మి
'అదేమిటోరు! అంతమాట అనేశావ్!' అన్నాడు యాదగిరి.
'మీరు చేసేది పుణ్యకార్యం!అదే ఇతరులు చేస్తే అది పాపకార్యం! మీరు చేస్తే దేశం కోసం! అదే ఇతరులు చేస్తే దేశద్రోహం! మీరు ఈ దేశ సంపదను అంబానీలు,ఆదానీలకు పంచిపెడితే అది దేశం కోసం! దాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం! పది లక్షల కోట్ల మేరకు పెద్ద కంపెనీల అప్పులు రద్దు చేస్తే అది దేశభక్తి! దాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం! రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకున్న దబ్బులు జీఎస్టీ, పెట్రోల్, సిలిండర్ కోసం ఖర్చు పెట్టివారిపై ధరల భారం ఎందుకు మోపాలన్న ఇంగిత జ్ఞానం లేనివారికి, ఈ దేశాన్ని పాలించే అర్హత లేదు!' దులిపేసింది లక్ష్మి.
యాదగిరి తలెత్తి చూడలేదు!
- ఉషాకిరణ్