Authorization
Sun April 06, 2025 12:34:24 am
కొత్త చిగుర్లు తొడుగుతోంది..
కాలమయిందని చెట్టు..
పరవశించిన ప్రకతి మలుపు
కమ్మని కోకిల పిలుపు..
పాత కొత్తల మేలవింపుతో
''షష్టి వర్ష కాల చక్రం'' మార్పును
ఆహ్వానించడమే నూతన వత్సర ''ఉగాది''..
షడ్రుచుల పచ్చడి సారాన్ని ఆస్వాదిస్తూ..
మన జీవన సమ్మిళిత విశ్వాస స్పూర్తితో..
ఆశయ సాధనే అంతిమ లక్ష్యంగా..
నిర్భయంగా ప్రయాణాలు, ప్రయత్నాలు చేస్తాం..
అదే..జీవిత సత్యం విజయ రహస్యం..
మెరుగులకైనా, మెరుపులకైనా
''మార్పే'' చక్కని మేళవింపు..
సుఖసంతోషాలకు ఏకైక నియమం..
రాత్రి ప్రశాంతంగా నిద్ర పోనియ్యని
పనులేవి పగలు చేయరాదు..
పగలు తలదించుకునే పనులను
రాత్రి తలపెట్టకూడదు..
వీటిని నిత్య జీవితంలో అమలు చేసే వారిని
కాలం కావ్య గర్భం(చరిత్ర)లో నిలుపుతుంది..
కాదంటే? కాల గర్భంలో కలుపుతుంది..
మనలోని శక్తి యుక్తులను పోగుచేసుకుని
నిన్నటి కన్నా! నేడు కొత్త తలంపుతో
నెగ్గేదాకా తగ్గేదే లేదని..
నూతన శోభకృత్ వత్సరానికి
స్వాగతం పలుకుదాం...
- మేకిరి దామోదర్,
సెల్:9573666650