Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దున్నే మోగే అలారం
సడీ సప్పుడులేకుండా
ఆగిపోయింది
గుప్పెడు కోరికల గింజల్ని
నాటుకున్న నిరుద్యోగ పక్షిపిల్లలు
గూడు చెదిరి
అల్లకల్లోలమయ్యాయి
భుజాల మీది కలలపావురాలను
ఎవడో ఎత్తుకెళ్ళాడు
ఎవరి దేహం వారికి బరువయ్యి
ఒకటే నరకయాతన
సందేహాలు
నీలినీడల్లా కమ్ముకొని
వేయాల్సిన అడుగులను
కత్తిరిస్తున్నాయి
దుప్పటి కప్పుకుని
నిద్రిస్తున్న వ్యవస్థలన్నీ
ఎవడి చేతిలోనే
పావులయి కలవరపెడుతున్నాయి
లోలోపలి దిగుల్ల దూగుళ్ళన్ని
సూర్యుని వైపు చూస్తూ
స్వచ్ఛమైన కిరణాలను కాసే
ఒకానొక ఉదయాన్ని కాంక్షిస్తూ
వేచిచూస్తున్నాయి.
- తండ హరీష్ గౌడ్
8978439551