Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశ్నించే గొంతుకను పాలకపక్షాలు ఫిర్యాదులు, కేసులు, బెదిరింపులతో గొంతు నొక్కుతున్నాయి. జర్నలిస్టులు... ప్రశ్నించే తోటి జర్నలిస్టులపై ప్రెస్మీట్లోనే అధికార పార్టీ నేత విషం కక్కితే బాధిత జర్నలిస్టుకు ఫొటోలు, వీడియోలు షేర్ చేసేందుకు సైతం భయపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో 'మువ్వ మౌనం ఎందుకో!' అనే కథనాన్ని రాసినందుకు దళితుడు కానీ ప్రజా ప్రతినిధి సదరు విలేకరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశాడు. ప్రధాన మీడియా సభ్యుల సంస్థలకు ఫిర్యాదులు లేదంటే మీడియా ప్రతినిధుల సతీమణుల ఔట్సోర్సింగ్ ఉద్యోగాలపై ఫిర్యాదులు, అధికారులతో విచారణలు చేపడతానని బెదిరింపులకు గురిచేస్తాడని ముందు గానే భయపడు తున్నారు. ఉగాది పండుగ రోజు ఆలయం వద్ద ఫ్లెక్సీ పెడితే తండ్రి, కొడుకులను తన అనుమతి తీసుకోలేదని సర్పంచ్ భర్త అసభ్యకరంగా దూషించి, కాలితో తన్ని మళ్లీ తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. దీనిపై పట్టించుకోని అదే మీడియా అదే రోజు 'పిచ్చికుక్క కరిస్తే నలుగురికి గాయాలు' అనే వార్త రాయడం పట్ల పాలకపక్షాన్ని ప్రశ్నించాల్సిన జర్నలిజం ఎంత భయపడుతుందో అని నవ్వు కుంటున్నారు జనం.
- జాదవ్ శరత్