Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టిన నాటి నుంచీ
పుట్టిన గడ్డకోసమే
రక్త బిందువులన్నీ అక్షరాలుగా మార్చిన
నిజమైన దేశభక్తుడు
దేశమంటే
ఒక్క కులమే కాదని
కులాల పుట్టుకను స్కానింగ్ చేసి చూపించిన
సామాజిక శాస్త్రవేత్త
చీకట్లో ఎటువైపు నడవాలో
తెలియని స్వతంత్ర దేశానికి
రాజ్యాంగ దీపాన్ని వెలిగించి
చేతిలో పెట్టిన మార్గదర్శి
ఈ దేశంలో పుట్టిన
ప్రతి మనిషికి సమానంగా
హక్కులను పంచి పెట్టిన
నికార్సైన మహాత్ముడు
ఆయన లేకపోతే
ఈ దేశాన్ని ఏ రాహువు మింగేసేదో?
కింది జాతుల జీవితాలు
ఎంతగా 'తలకిందు'లయ్యేవో??
ఏ నాటికైనా
నా దేశాన్ని దేశంగా నిలబెట్టేది
ఆయన చూపుడు వేలే!
-తోకల రాజేశం, 9676761415