Authorization
Sat April 05, 2025 09:40:21 am
పెరిగాము... కాళ్ళూ చేతులూ తలల లెక్కల్లో
అక్కడే అనేకం... ఆకలి కడుపుల నకనకల్లో
ఆ పక్కనే వందకొకటి... కార్పొరేట్ పందికొక్కు
మన నిజం దాచేసుకుని... చైనాతో పోలికెందుకు
ఉన్నోళ్ళవీ లేనోళ్ళవీ... అన్నీ కలబోసి చూపేటి
తరసరి లెక్కలూ తలల లెక్కలతోనా అభివృద్ధి?
దారిద్య్రంపై పోరాటం వారిది... దానితో దోస్తీ మనది
కాకులగొట్టి గద్దలకు దోచి పెట్టే రాజనీతి మనది
గద్దల అదుపులో పెట్టి
కాకుల కడుపు నిమిరే దారి వారిది
వొద్దొద్దులే.... మానేద్దాం.... మూసేద్దాం
పనికిరాని పరువు తక్కువ పోలికలు
- ఉన్నం వెంకటేశ్వర్లు