Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలై రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ప్రజలు భయటకెళ్లడానికే భయపడు తున్న పరిస్థితి నెలకొంది. దీనికి కారణం దేశ వ్యాప్తంగా అనేక చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం. మినిమం 35 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండటం ఆందోళనకరమైన విషయం.అయితే అధిక ఉష్ణోగ్రతలకు అందరూ బాధ్యులేనని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పారిశ్రామికీకరణ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా అడవులు, కొండలు, గుట్టలు నరికివేత జరుగుతోంది. ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోంది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, క్యారీ బ్యాగ్స్, వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులు అనకొండలాగా అంతటా వ్యాపించి ఉన్నాయి. మరో వైపు గత మూడు సంవత్స రాలుగా 'కోవిడ్'కారణంగా మాస్క్‌లు, శానిటైజర్స్, పిపిఈ కిట్స్ వంటి వినియోగం పెరగడంతో టన్నుల కొలదీ వ్యర్ధాలు రూపంలో దేశవ్యాప్తంగా ప్రతీ ఖాళీ స్థలం నిండిపోయింది. డిస్పోజబుల్/ యూజ్ అండ్ త్రో వంటి వస్తు వినియోగం, ఎలక్ట్రానిక్ వస్తువులు పెరగడంతో భూఉపరితలం అంతా నిండిపోతూ, కనీసం వర్షం నీరు కూడా భూగర్భంలోకి పీల్చే పరిస్థితి లేదు. దీంతో ఎన్ని రోజులు, గంటలు వర్షం కురిసినా, కొద్ది గంటల్లో నీరు పల్లపు ప్రాంతాలకు పయనించి, తేమలేని పరిస్థితి నెలకొంది.
ఇక ఇటీవల కాలంలో కాంక్రీటు జంగిల్‌గా నివాసప్రాంతాలు మారిపోతుంది. సిమెంట్ రోడ్లు భవనాలు, పార్కింగ్ పేరుతో టైల్స్ వినియోగం పెరగడంతో భూఉపరితలం అంతా ఒక్క చుక్క నీరు లోనికి ప్రవేశించలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అభివద్ధి పేరుతో అడవులు నరికివేత. పక్రతి విధ్వంసం జరుగుతుంది. అభివద్ధి చెందిన దేశాలు తమ స్వార్థం కోసం అమెజాన్ అడవులు వంటి వాటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. మంచు పర్వతాలు కరిగిపోతూ సముద్ర నీటి మట్టాలు పెరుగుతూ పల్లపు ప్రాంతాలు మునుగుట ప్రారంభం అవుతుంది. మనదేశంలో పంట వ్యర్ధాలు తరచూ ఢిల్లీ చుట్టు పక్కల రాష్ట్రాల్లో తరచూ కాల్చడం వల్ల మరింతగా కాలుష్యం, వేడి ప్రబలుతున్నది. ఇక పెట్రోల్ డీజిల్ బొగ్గు వినియోగం పెరగడంతో పట్టణాలు, పల్లెల్లో ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. రిఫ్రిజిరేటర్స్, ఏసీలు సర్వసాధారణమయ్యాయి. మొక్కలు నరకడం తప్ప, పెంచే పని తగ్గుతుంది. ప్రతీ ఒక్కరూ తమ సౌకర్యాలు, సుఖాలు కోసం ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేస్తున్నారు. అనవసరంగా ఇంధన వినియోగం చేస్తున్నారు. కాలినడక, సైకిల్ వాడకం మానేశారు. కానీ, అదేం చిత్రమో... ఆరోగ్యం కోసం మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేయటం గమనార్హం. అదే పని వారి పని ప్రదేశాలకు నడక, సైకిల్ వాడకం ఎంత మంచిది. ఆరోగ్యంతోపాటు ఆర్థికంగా ఎంత లాభం... ఆలో చన చేయాలి. మానవుని స్వార్థమే, పర్యావరణ అసమతౌల్యానికి కారణం అని ఇకనైనా గ్రహించాలి. కర్భన ఉద్గారాలు తగ్గించాలి. సోలార్, పవన విద్యుత్తు వాడకం పెంచాలి. ప్రభుత్వాలు వీటిని ప్రోత్స హించాలి. పర్యావరణ శాస్త్ర వేత్తలు సూచనలు సలహాలు పాటించాలి. పాఠశాల విద్య నుంచి విద్యా ర్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలి. ప్రభుత్వాలు వివిధ పరిశ్రమలు స్థాపించే క్రమంలో అన్ని నిబంధనలు పాటిస్తూ అనుమతులివ్వాలి. ప్రపంచ వ్యాప్తంగా తరచూ ఏదో ఒకచోట జరుగుతున్న యుద్ధాలు, క్షిపణి ప్రయోగాలు, దాడులు, ఉగ్రవాద కార్య కలాపాలు అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా సమాజంలోని అందరిలో పర్యావరణం, ప్లాస్టిక్ వినియోగం, కాలుష్యాలపై అవగాహన కల్పించాలి.స్వచ్ఛంధ సంస్థలు, మీడియా, ప్రభుత్వాలు ఈ అధిక ఉష్ణోగ్రతలకు కారణం మన చేతలే అని తెలియపరచాలి. నష్టనివారణకు మనం అందరం ఇకనైనా ప్రకృతిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో జీవరాశి, ప్రాణికోటి ఈ భూమ్మీద మనజాలవు అనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి..
- ఐపీ రావు, 6305682733