Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినీ చరిత్రలో కమర్షియల్ చిత్రాలెన్నో బ్లాక్‌బస్టర్ అందుకున్నాయి. థియేటర్లలో రెండు, మూడు వందల రోజులు నడిచిన సినిమాలు ఉన్నాయి. వందల కోట్ల రూపాయాల కలెక్షన్లు రాల్చాయి. జనం థియేటర్లకు రావడం తప్ప మరో మార్గంలేని రోజులవి. అటువంటి చిత్రాల గురించి జనం కథలు, కథలుగా చెప్పుకునేవాళ్లు. అలాంటివి కమర్షియల్‌గా గొప్పపేరు తెచ్చిపెట్టినవే. కానీ ప్రజల హృదయాలను కొల్లగొట్టే చిత్రాలు కొన్నే ఉంటాయి. అందులో ఒక్కటి పీపుల్స్‌స్టార్ నటించి, దర్శకత్వం వహించిన ఎర్ర సైన్యం చిత్రం సినీ ఇండ్రస్టీని షేక్ చేసింది. తక్కువ బడ్జెట్ ఎక్కువ పాపులారిటీ సంపాధించి, కమర్షియల్ డైరెక్టర్లకు సవాల్ విసిరింది. కుటుంబాలకు కుటుంబాలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, బస్సుల్లో సైన్యంలా వెళ్లి ఎర్ర సైన్యం చిత్రాన్ని తిలకించారు. పైసలు లేకపోయినా బదులో, సదులో చేసి మరి ఆ సినిమాను చూశారు. వామపక్ష భావజాలానికి స్వర్ణయుగంగా ఉన్న రోజుల్లోనూ ఎర్రసైన్యం దేశ సరిహద్దులను దాటింది. ఇప్పుడంటే పార్కింగ్‌లో కార్లు, టూ వెహికల్స్ కనిపిస్తున్నాయి. అప్పుడు మాత్రం ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల కనిపించేవి. తాజాగా బలగం చిత్రం సైతం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. మెస్మరైజ్ చేస్తున్నది. అన్ని సౌకర్యాలు ఉండి థియేటర్లకు పోవడం ఒక ఎత్తయ్తితే... ఉరూరా పరదపై బలగం చిత్రాన్ని చూపించడం మరో ఎత్తు. ఆయా కుటుంబాల్లో ఎప్పుడో మరణించిన తమ వారి స్మార్థకార్థం కోసం బలగాన్ని ఉచితంగా చూపిస్తున్నారు. ప్రజల అదరణను పసిగట్టిన మన నేతలు సైతం ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. ఆ సినిమా నాయకుల ప్రసంగంతో ప్రారంభిస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలంగాణలో పాతుకు పోయిన కర్మకాండల సెంటిమెంట్‌ను రగిలించిన బలమే మన 'బలగం'.
-గుడిగ రఘు