Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకడి రెక్కను వేరొకడు విరిచి
సొంత లెక్కన ఎగరేసు కెళితే
తన ఆస్తి హక్కుగ దోచి దాస్తే
రాజ్య బంధం కలిసి నిలిస్తే
అదే... అదే కదా కేపిటలిజం
దోచి నోళ్ళవి లెక్క తీసి
హక్కు ఎలా దక్కెనంటే
ఉన్న - లేని వర్గ చీలిక
సమాజాన తథ్యమవద
కష్ట ఫలికై పోరు లెగవద
రాజకీయం మలినమైతే
వర్గాల మధ్యే ఘర్షణైతే
అల్ప వర్గం ఓడిపోదా
అసంఖ్యాకులు గెలిచి రారా
అదే కదా శ్రముల పాలన
రెక్క చిందిన చెమట చుక్క
లెక్క తప్పక నోటి కందితే
ఎవడి కష్టం వాడు బొక్కే
రాజ్య లక్ష్యం శ్రమ పక్షమైతే
అదే... అదే కదా సోషలిజం
ఇది తప్పని సామాజిక తీర్పు
- ఉన్నం వెంకటేశ్వర్లు