Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరంలేని నాలుక ఎన్నైయినా మాట్లాడుతుంది అనేది నానుడి. అబద్దాలు మాట్లాడటం, చాడీలు చెప్పడం, ఉన్నది లేది కలగాపులకం చేసి మాట్లాడిన సందర్భంలో ఇలాంటి సామెతను ఉపయోగిస్తారు. కాంగ్రెస్‌లో అతివీర భయంకరుడిలా మన జగ్గన్న కూడా ఎప్పుడు ఏం మాట్లాడుతాడో చెప్పడం కొంచెం కష్టమే. తాజా గాంధీభవన్‌లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవు అంటూ సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇలా ఎన్నోసార్లు దెప్పిపొడించే మాటలు మాట్లాడం ఆయన నైజం. ముఖ్యంగా రేవంత్‌రెడ్డికి పోటీ ఎవరూ లేరు. నేనే ఆయనకు పోటీ. నాకేం తక్కువ అంటూ మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇద్దరు ఎదురుపడగానే కడుపులో తలకాయ పెట్టి నవ్వుకుంటారు. వీరి నటనా చాతుర్యం ప్రదర్శిస్తారు. ఒకరిపై ఒకరికి ఎంతో విశ్వాసం ఉన్నట్టు నవరసాలు పండిస్తారు. అక్కడుచ్చి కొంచెం జరిగారో లేదో...కత్తులు నూరుతారు. ఇదేమీ రాజకీయమో అర్థం కాదు. ఇలా మాట్లాడి నిత్యం వార్తల్లో ఉండటం ఆయనకు సరదా. ఆయన నటనకు మీడియా ప్రతినిధులు సైతం ఫిదా అవుతారు. ఆ రోజంతా స్క్రోలింగులు, వన్ టూ వన్లు ఒక్కటే గోల. ఆయన వచ్చాడంటే చాలు ఏదో ఒక న్యూస్. తాజాగా పాదయాత్ర చేస్తానంటూ ప్రకటిం చారు. ఇక్కడ విశేషమేంటే, రేవంత్‌రెడ్డి రెండో దఫా తిరిగే ప్రాంతాల్లో తాను పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించి మరో ఒక చర్చకు తెరతీశారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోతే ఏంటి అని ప్రశ్నిస్తే... నాకేందుకు రాదు.... కచ్చితంగా అనుమతి ఇస్తారని చెబుతారు. అప్పుడు అలా మాట్లాడారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే, అదంతే...ఇదింతే...అని నవ్వుతారు.
-గుడిగ రఘు