Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బూర్జువా పార్టీలు యాడ సభలు పెట్టినా మాటలతో మాయబుచ్చి, బీరూబిర్యాణీ ఇచ్చి పోరగాండ్లను పట్టుకొస్తున్నదన్నది జగమెరిగిన సత్యం. ఎన్నికల్లో పైసలిచ్చి గెలుస్తున్నరనే విషయాన్నీ ఎవ్వరూ కాదనలేరు. కమ్యూ నిస్టులు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతున్నారంటే...'వారు ఎన్నికల్లో ఇతర పార్టీల లెక్క పైసలు పంచరు...మీటింగ్లకు బీరూబిర్యాణీ ఇచ్చి తీసుకపోరు. మీటింగ్లకు కార్యకర్తలు ఎవ్వరి సద్ది వారే కట్టుకుపోతారు. పార్టీ గెలుపు కోసం శాయశక్తులా పనిచేస్తరు' అనే విషయాన్ని రాజకీయాల మీద కొంచెం అవగాహన ఉన్న ఏ వ్యక్తిని అడిగినా ఇదే చెబుతాడు. ఇదీ చారిత్రక సత్యం. బండి సార్కు గీ కూసింత అవగాహన లేనట్టున్నది. తొండి మాటలు మాట్లాడు తూనే ఉన్నడు. అడ్డంగా బుక్కయిపోతున్నడు. కర్నాటక రాష్ట్రంలోని బాగేపల్లిలో సీపీఐ(ఎం) బలంగా ఉంటుంది. గతంలో పలుమార్లు ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా కూడా గెలుపొందారు. గత ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచారు. బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అట్లాంటి చోట బీజేపీ అభ్యర్థి తరఫున ప్ర చారం చేయడానికి వెళ్లి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. 'కమ్యూనిస్టులను గెలిపిస్తే ఈ ప్రాంతంలో బార్, బీర్ తప్ప ఏం అభి వృద్ధి జరగలేదు' అని కూసిండు. ఇది బీజేపీకి మరింత నష్టదాయకంగా మారింది. 'మా ప్రాంతానికొచ్చి మమ్ముల్ని తాగుబోతులు' అంటవా? అని ఆ ప్రాంత ప్రజలు గుస్సా అవుతున్నరు. సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ అనిల్ కుమార్ నిత్యం ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు చేసి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. ప్రజా పోరాటాల్లోనూ బాగేపల్లికి ఓ చరిత్ర ఉంది. అలాంటి చోటికెళ్లి కమ్యూనిస్టులపై నిందలేయడమంటే సూర్యుడిపై ఉమ్మేసినట్టే.
- అచ్చిన ప్రశాంత్