Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బేటీ బచావో... బచావో!
వాడి ముఖంపై కొన్ని కన్నీళ్లు చల్లి లేపండి
తలపై మోది చెప్పండి
లేచి కళ్లు తెరచి చూడమనండి
వాళ్లు ఏడుస్తున్నారు.
నడిరోడ్డుపైనే వ్యధను ప్రవహిస్తున్నారు
అరుస్తున్నారు, అర్థిస్తున్నారు,
ఆక్రోశిస్తున్నారు, ఆవేదిస్తున్నారు
కాపాడమని చేతులు జోడించి
కళ్లల్లో నిప్పులు రాజేస్తున్నారు
అతన్ని పిలవండి.
ముఖం చాటేస్తున్న వాన్ని
ఖడ్గమృగాల కాపు కాస్తున్న వాన్ని
అధికారంకై భిక్షమెత్తుతున్న వాన్ని
చెప్పడమే తప్ప వినటం తెలియని వాన్ని
పిలవండి! పిలవండి!!
నిద్రిస్తున్నాడా! నటిస్తున్నాడా!!
చెంప చరిచి లేపండి!
ఇక్కడ
ఆడపిల్లలేడుస్తున్నారు...
ప్రశ్నలై మొలుస్తున్నారు
ఒట్టిమాటల్ని నిలేస్తున్నారు!
పిడికిళ్ళె లేస్తున్నారు.
- ఆనంద