Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభివృద్ధి హౌమంలో ప్రపంచ ఊపిరితిత్తులుగా పేరొందిన అటవీ సంపద ఆహుతి అవుతున్నది. దీనికి ఆజ్యం పోస్తున్నది మనిషే. మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుంటు న్నట్టుగానే ప్రపంచానికి ప్రాణ వాయువును ఇచ్చే అడవులను నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి పేరుతో, అవసరాల పేరుతో కొల్లగొడుతున్నాం. ఈఅడవులు ప్రకృతి వైపరిత్యాలకు కొంత, మనిషిస్వార్ధానికి కొంత అగ్నికి కాలిబూడిద అవుతున్నాయి. ఇప్పటివరకు 43శాతం అడవులు అంతరించిపోయినవి.
గత నెల రోజులుగా అమెరికాలోని ఆరిజోనాలోని పర్వత ప్రాంతాలలో, చిట్టడువులలో మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ మంటలు మూడు అతిపెద్ద పట్టణాలకు దగ్గరలో ఉండటంతో ఆ ప్రాంతాలలో పరిస్థితి గంభీరంగా ఉదని అక్కడి వాతావరణ సంస్థ తెలిపింది. ఈ ఒక్క సంవత్సరంలోనే 432,000 ఎకరాల విస్తీర్ణం గల ప్రాంతం ఈ కార్చిచ్చులో దగ్ధమైంది. ఈ మంటలలో అత్యంత తీవ్రమైనవిగా పేర్కొనబడేవి మూడు రకాలు. అవి బుష్ ఫైర్స్, బిగ్ హార్న్ ఫైర్స్, మాంగం ఫైర్స్. ఈశాన్య ఫీనిక్స్‌లో ఒక వాహనం జూన్ నెలలో అగ్ని ప్రమాదానికి గురి అవడంతో బుష్ ఫైర్స్ అంటుకుని ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి. దక్షిణ ఆరిజోనా ప్రాంతంలోని పర్వత ప్రాంతం 45శాతం మంటలకు ఆహుతైనది. వీటిని ఆర్పడానికి సుమారు 1200మంది అగ్నిమాపక సిబ్బందిని పురమా యించారు. కైబాబ్ నేషనల్ ఫారెస్ట్ 51శాతం మంటల (మాంగం మంటలు) పాలైంది. జాకబ్ సరస్సు, హౌస్రాక్ రోడ్ ప్రాంతాలలోని నివాసస్తులను అక్కడ నుంచి రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ''ఇదే సమయంలో కరోనా మహమ్మారి అక్కడి ప్రజల్లో ప్రభలుతుండటంతో వారిని వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, మంటలను ఆర్పే సిబ్బంది పనిచేయడం కష్టంగా ఉంది'' అని ఆరిజోనా అటవీ, అగ్నిమాపక శాఖ ప్రతినిది తెలిపారు. ఆ ప్రాంతాలలో ఈ మంటలు ప్రతీ ఏడు జూన్, జూలైలో ఉండే అత్యంత వేడి వాతావరణం, తక్కువ ఆర్ద్రత (గాలిలో నీటి ఆవిరి) ఉండటం వల్ల సాధారణమే అయినప్పటికీ పెరిగే వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వాటి తీవ్రతను మరింత పెంచుతున్నాయి.
అమేజాన్ అడవులు జీవవైవిద్యానికి పెట్టిందిపేరు. ప్రపంచ జీవవైవిద్యంలో 10శాతం ఈ అడవుల్లోనే ఉంది. 20శాతం ఆక్సీజన్‌ని ప్రపంచానికి అందించేది ఈ అడవులే. 2019సంవత్సరంలోనే 73వేలసార్లు మంటలు వ్యాపించి నవి. బ్రెజిల్లో రోరైమ, అక్రే, రోన్దోనియ, అమెజానో రాష్ట్రాల్లో అడవులు అగ్నికీలల్లో దగ్ధమైన విషయం తెలిసిందే. పెరుగుతున్న భూతాపం (గ్లోబల్ వార్మింగ్), వాతావరణ మార్పులు (క్లైమేట్ చేంజ్). వేడి గాలులు, పొడి వాతావరణం, ఆకాశంలో మెరుపులు, పిడుగుపాటుకు గురి కావడం, మానవ తప్పిదాలు, అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలు, స్థలం కోసం సహజ వనాలను కాల్చడం వలన ఎప్పుడూ ఎక్కడో ఒక దగ్గిర ఈ చెట్లు, అడవులు మంటలకు ఆహుతి అవుతూనే ఉన్నాయి.
ఈ మంటల కారణంగా పెద్దమొత్తంలో పొగ ఏర్పడి చుట్టూ వ్యాపిస్తున్నది. ఈ మంటల నుంచి గ్రీన్హౌస్ వాయువులు విడుదల అయి మన ఆవరణ వ్యవస్థని పాడుచేస్తున్నాయి. పచ్చని చెట్లు మంటలకు అంటుకొని గాలిలోని ప్రాణ వాయువు తగ్గిపోతున్నది. వర్షాలు తగ్గి భూతాపం (గ్లోబల్ వార్మింగ్) ఎక్కువవుతున్నది. అడవుల్లో నివాసంగా ఉండే ఎన్నో ప్రాణులకు ఉండే నీడ దూరమై మనుషులు తిరిగే ప్రాంతాలలో ఉండలేక అవి చని పోతున్నాయి. దానితో ఎన్నో జీవులు అంతరించి పోతున్నాయి. చుట్టు పక్కల నివాసమేర్పరుచుకున్న ఎంతో మంది నిర్వాసితులు కావడం, వేరే ప్రాంతాలకు వలస వెళ్ళటం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలుగుతూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చూస్తూ బాధపడటం కంటే ఆ సమస్య రాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేదానిపై పరిశోధనలు చేయటం, చర్యలు తీసుకోవటం ఏంతోముఖ్యం. ఈనేపథ్యంలో అడవులకు మంట అంటుకోకుండా, వ్యాపించకుండా ఉండాలంటే తీసుకోవలిసిన కొన్ని చర్యలపై శాస్త్రవేత్తలు ఆలోచించాల్సిన సమయం ఇది. భూతాపాన్ని పెంచే గ్రీన్హౌస్ వాయువులను కట్టడి చేసి మంటలకు అంటుకోకుండా తట్టుకునే మొక్కలను సృష్టించటం పైజెనెటిక్ ఇంజనీరింగ్ పరిశోధనలు చేయాలి. అడవుల మధ్యలో ఈమంటలకు అంటుకోకుండా తట్టుకునే చెట్లుపెంచటం, అక్కడక్కడా నీటిచెరువులు, కాలువలు తవ్వించడం మొదలైనవి చేయడం. ఇలా చేయడం ఖర్చుతో కూడుకున్న పనే అయినా ఒకసారి ఏర్పాటుచేస్తే కొన్ని సంవత్సరాల వరకు ఉపయోగపడతాయి. పెద్దమంట లను త్వరగా ఆర్పే పర్యావరణహిత వాయువులులేక స్ప్రేలను కనుక్కోని వాటిని వాయురవాణా మార్గాల ద్వారా సమర్ధవంతంగా ఉపయోగించగలగాలి. అడవుల దగ్గరలో నిప్పువాడకాన్ని, బాణసంచా, టపాసులు కాల్చడం పూర్తిగా నిషేధించాలి. అక్కడ నివసించే గిరిజనులు, రక్షణ సిబ్బందికి ఫైర్‌ప్రూఫ్ ఇండ్లు ఉండేటట్టు చూడాలి. పొగ తాగేవారిని అనుమతించవద్దు. వీలయినంతవరకు కొట్టేసిన అటవీ ప్రాంతాన్ని భర్తీచేయటానికి తిరిగి చెట్లునాటాలి. అలాచేసే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించి అందించాలి. ఈ ప్రాంతానికి దగ్గరలో వ్యవసాయం చేయటానికి అడవులను నరకటానికి అనుమతించవద్దు. వారికివేరే ప్రాంతంలో వ్యవసాయానికి భూమిని చూపించాలి. అటవీ విస్తీర్ణాన్ని వీలైనంత ఎక్కువగా పెంచే ప్రయత్నాలు ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. అడవులలో అగ్నిప్రమాదాలకు కారణమైనవాళ్ళను కఠినంగాశిక్షించాలి. అటవీ సంరక్షణకు కొత్తచట్టాలను, పాలసీ లను ఎప్పటికప్పుడు తయారుచేయాలి. అమలుపరచాలి.
డా|| హిమబిందు