Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండవ సుబ్బారావు, 9493335150
''అవును సార్. మీరన్నది నిజమే. అందుకే నాకో ఆలోచనవుంది. బహుశా నా ఆలోచన నా ఆదివాసీల బాగోగుల గురించే కావచ్చు. నా స్వార్థం కావచ్చు. కనీసం నా జాతి వారిని ఉద్ధరించాలనే తపన కావచ్చు. నేను నా ఆదివాసీలలో వంద శాతం మంది చదువుకున్న వారిని చూడాలనేదే కాదు. ఎక్కువ మందిని ఉన్నతాధికారులుగా తయారు చేస్తే, వారంతా తమ తమ అధికారాలను ఉపయోగించి మరెందరినో నా లాంటి వారిని తయారు చేయగలరు. మీ లాంటి ఆలోచన ఎంత మందిలోవుంది ? నూటికో కోటికో ఒక్కరుంటే నా లాంటి వారు కొందరు తయారయ్యారు. అందుకే నేను ఒక మంచి బడితో పాటు, సివిల్స్‌కు తయారు చేసే శిక్షణాకేంద్రం పెట్టాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేక పోతే.....'' సందేహంగా అరుణ్ మొఖంలోకి చూసింది.
దేశంలోనే అత్యున్నతంగా భావించే సివిల్ స్రర్వీసెస్ ఫలితాల్లో ఈసారి కూడా టాప్ ర్యాంకులు సాధించిన భద్రాచలం ఆదివాసీలు. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపిల నుంచి 50 మంది ఎంపికైతే, అందులో పాతిక మంది ఒక్క భద్రాచలం నుంచే ఉండటం విశేషం. ఈ సంవత్సరమే కాదు గత ఐదు సంపవత్సరాల నుండి రెండంకెల కంటే తగ్గలేదు. ఎక్కడో మారు మూల రాష్ట్ర రాజధానికి సుమూరు మూడు వందల కిలోమీటర్ల దూరంలో భద్రాచలం పుణ్యక్షేత్రం ఉందని దేశంలో చాలా మందికి శతాబ్దాలుగా తెలుసు. కానీ, గత ఐదు సంవత్సరాల నుండి భద్రాచలం శ్రీరాములవారి పుణ్యక్షేత్రమే కాదు దేశానికి సేవలందిచే చక్కని సుశిక్షితులైన ఐపిఎస్, ఐఏఎస్ లను తయారు చేసే విద్యా క్షేత్రమూ భద్రాచలానికి అరవై కిలో మీటర్ల దూరంలో పవిత్ర గోదావరి తీరంలో కొలువై వుందని దేశానికి తెలిసింది. అలా దేశానికి తెలిసేటట్టు చేసింది ఆదివాసి బిడ్డ మహాలక్ష్మి ఐపిఎస్ కమ్ ఐఏఎస్. చిన్న తనంలో ఆమెకు ప్రపంచమే తెలీయని వయస్సులో వాళ్ళ పద్ధతి ప్రకారం ఆమె పెళ్ళి చేశారు తల్లిదండ్రులు. మగడంటే ఏమిటి? పెళ్ళి ఎందుకు? ఇలాంటి విషయాలు మహాలక్ష్మికి తెలియవు. ఇప్ప పువ్వు ఏరటానికి వెళ్ళిన మగడు ఎందుకు తిరిగి రాలేదో కూడా ఆమె అర్థం చేసుకునే వయస్సు కాదు. సరిగ్గా అప్పుడే అరుణ్ కుమార్ ఐటిడిఏ భద్రాచలం అధికారిగా వచ్చాడు. ఈ వార్త తెలుసుకొని వెంటనే బయలుదేరి తాలిపేరు చేరుకున్నాడు. ఆ ఊరి బడిలో కూర్చొని మహాలక్ష్మిని ఆమె తల్లి దండ్రులను పిలిపించాడు. మూడవ తరగతి చదువుకునే మహాలక్ష్మికి ఎందుకు పెళ్ళి చేశారు? ఐదవ తరగతితోనే చదువు మాన్పించి బుజ్జిగాడ్ని ఎందుకు ఇప్పపువ్వు ఏరటానికి పంపించారు? వివరాలు అడిగి తెలుసుకున్నాడు.
''ఇప్పడేం చేయాలనుకుంటున్నారు? ''అరుణ్ కుమార్ ఫ్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. రాదానీ తెలుసు.
''ఏం ..మహాలక్ష్మి చదువుకుంటావా?'' ధగ్గరకు తీసుకొని ప్రేమగా అడిగాడు.
''ఆ...'' అని సంతోషంగా అంటూ, అనుమానంగా అయ్య మొఖంలోకి చూసింది.
''సారు ! మాకు చదువులెందుకు? పైగా ఆడ పిల్ల.'' అంటూ భయం భయంగా అధికారి మొఖంలోకి చూసి, వెంటనే తలదించుకున్నాడు.
''నీకు చదువు వద్దులే. ఈ మహాలక్ష్మిని నాతో పంపించు. బాగా చదివించి, మంచి ఉద్యోగం ఇప్పించి పంపిస్తాను. ఆఉ.. సరేనా? ''అని, పక్కనున్న ఆ ఊరి బడి హెడ్మాష్టరుకు చేయవలసిన సూచనలు ఇచ్చి వెళ్ళి పోయాడు. మహాలక్ష్మి భవిష్యత్తే మారి పోయింది.
భద్రాచలం ఐటీడిఏ గురుకులంలో చేరి మహాలక్ష్మి పదవ తరగతి రాష్ట్రస్తాయిలో ప్రథమ ర్యాంకుతో పాసైంది. అప్పుడు ఇంటర్ బోర్డ్ కార్యదర్శిగా పని చేస్తున్న అరుణ్ కుమార్ మహాలక్ష్మిని తన మిత్రుడు ప్రత్యేక అధికారిగా పని చేస్తున్న గిరిజన ఆశ్రమ కళాశాలలో చేర్పించాడు. తరుచుగా ఆ అదికారి మరియు అరుణ్ కుమార్ అన్ని గిరిజన కళాశాలపై ప్రత్యేక శ్రధ్ద పెట్టి విద్యార్థులకు చక్కని సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు. ఇంటర్ కూడా మహాలక్ష్మి మొదటి ర్యాంకు సాధించింది. జెఎన్‌టియూలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని క్యాంపస్ సెలెక్షన్లో గూగుల్ లో సంవత్సరానికి కోటి రూపాయల జీతం సంపాదిస్తుంది.
ఆదివాసి బిడ్డల్లో మాణిక్యాలున్నాయని, అవకాశాలు లేక అడవుల్లో ఆకులు అలములు తింటూ బతుకులీడుస్తున్నారని, స్వాతంత్య్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిసినా అవకాశాలు కొందిరికి అందని ద్రక్ష అయిందని, అరుణ్ కుమార్ వంటి కొద్దిమంది అధికారుల చొరవతో, మహాలక్ష్మి వంటి వారు కొందరు బయటి ప్రపంచానికి పరిచయమ వుతున్నరాని పత్రికలు, టీవీలు సమీక్షలు , చర్చలు నిర్వహించాయి.
మహాలక్ష్మి తనకు లభించిన ఉద్యోగంతోనే సరిపెట్టుకోలేదు. ఒక పక్క ఉద్యోగ ధర్మము చక్కగా నిర్వహిస్తూనే ఎలాంటి శిక్షణ లేకుండా సివిల్స్ రాసింది. మొదటి ప్రయత్నంలో ఆశింఛినంత ర్యాంకు పొంద లేక పోయినా తనకొచ్చిన ర్యాంకుకు ఐపిఎస్ సీటు వచ్చింది. తన మార్గదర్శి అరుణ్ కుమార్ సలహా తీసుకొని హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందింది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శిక్షణ ఐపిఎస్ అధికారిగా నియమించబడింది. ఉద్యోగ ధర్మాలు నిర్వహిస్తూనే అవకాశాలు కల్పించుకొని, గిరిజన పాఠశాలలు, కళాశాలల్లో తన అనుభవాలు విద్యార్థులకు వివరిస్తూ, మరుసటి సంవత్సరం మళ్ళీ సివిల్స్ రాసింది. అరుణ్ కుమార్ కల నిజమైంది. మహాలక్ష్మి మొదటి ర్యాంకు సాధించింది.
శిక్షణ పూర్తి చేసుకొని భధ్రాచలం ఐటీడ్ఏ పీవోగా బాధ్యతలు చేపట్టింది. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి విద్యా, వైద్యము, వ్యవసాయం రంగాలలో అనేక సంస్కరణలు చేపట్టింది. ఉత్తమ అధికారిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలచే అవార్డులు, రివార్డులు అనేకం పొందింది. కానీ, ఆదివాసీలకు , అణగారిన వర్గాలకు ఇంకా ఏదో చేయాలనే తపన చల్లార లేదు. ఏవేవో ఆలోచనలు. సరిగ్గా ఇలాంటి సమయంలో తనకు గురువు , మార్గదర్శి అయిన అరుణ్ కుమార్ ఉద్యోగ విరమణకు ఆహ్వానం అందింది. కేంద్ర సర్వీసుకు వెళ్ళి అనేక పదవుల్లో రాణించి చివరకు ఎన్నికల ప్రధాన అధికారిగా ఉద్యోగ విరమణ చేస్తున్నారు.
ఉద్యోగ విరమణ అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకొని , అరుణ్ కుమార్ ను వ్యక్తిగతంగా కలుసుకొని తన ఆలోచనలను చెప్పింది.
''ఈ విషయంలో నా సహకారమేమైనా కావాలా?'' మామూలుగానే అడిగాడు.
'' సా..ర్ ! ఇంకా మీరు రెష్ట్ తీసుకోరా?''
'' రెష్ట్ అంటే ఏమిటి? తనకిష్టమైన పనులు చేస్తూ కాలక్షేపం చేయటమేనా ?''
''జనరల్ గా అదే కదా సార్.''
''అయితే, నాకిష్టమైన పని , ఏదో ఒక పని చేస్తూవుండటమే. నాకు ఏదైనా పని ఇప్పిస్తావా?'' నవ్వుతూ అడిగాడు.
''అదేంటి సార్? మీరు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఏ పదవైనా దొరుకుతుంది. నేను అంత కంటే గొప్ప పదవులేమివ్వగలను? ''అంది ఆశ్చర్యంతో కూడిన నవ్వుతో.
'' చూడు మహాలక్ష్మి ! నా నలభై రెండెళ్ళ సర్వీసులో అన్నీ నా కిష్టమైన పనులేనా నేను చేసింది! లేదు. తాలిపేరులో నీ గురించి నేను చేసిన పనొక్కటే నాకు ఇష్టమైనది. మిగతా పనులన్నీ, ఉద్యోగ ధర్మంగా చేసినవే. ఇప్పుడు నువ్వ చేస్తున్న ఆలోచనలన్నీ బాగానే ఉన్నాయి. ఉంటాయి. కానీ, వందశాతం చేయగలవా? ఈ పాటికే నీకు కొంత అర్థమైవుంటుంది. మన తోటి, మన క్రింది అధికారులు అందరూ మనకు మల్లే ఆలోచించినప్పుడు ఏ పనైనా సాధ్యమవుతుంది. లేక పోతే ఎన్ని అడ్డంకులు? '' ఇంత కాలం తనలో దాగివున్న నగ సత్యాలను చెపుతున్నాడు.
''అవును సార్. మీరన్నది నిజమే. అందుకే నాకో ఆలోచనవుంది. బహుశా నా ఆలోచన నా ఆదివాసీల బాగోగుల గురించే కావచ్చు. నా స్వార్థం కావచ్చు. కనీసం నా జాతి వారిని ఉద్ధరించాలనే తపన కావచ్చు. నేను నా ఆదివాసీలలో వంద శాతం మంది చదువుకున్న వారిని చూడాలనేదే కాదు. ఎక్కువ మందిని ఉన్నతాధికారులుగా తయారు చేస్తే, వారంతా తమ తమ అధికారాలను ఉపయోగించి మరెందరినో నా లాంటి వారిని తయారు చేయగలరు. మీ లాంటి ఆలోచన ఎంత మందిలోవుంది ? నూటికో కోటికో ఒక్కరుంటే నా లాంటి వారు కొందరు తయారయ్యారు. అందుకే నేను ఒక మంచి బడితో పాటు, సివిల్స్‌కు తయారు చేసే శిక్షణాకేంద్రం పెట్టాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేక పోతే.....'' సందేహంగా అరుణ్ మొఖంలోకి చూసింది.
ఇంతలో, ''గుడ్ మార్నింగ్ సర్ ! అర్జంట్ గా రమ్మాన్నారట! చెప్పండి. మీకు నేనేమైనా సహాయపడగలనా? '' అంటూ వస్తూనే తన వినయ విధేయతను ప్రకటించాడు కొత్తగా వచ్చిన వ్యక్తి.
''కూర్చో వినరు. షీ ఈజ్ మిస్ మహాలక్ష్మి ఐపిఎస్ బార్ ఐఏఎస్.''
''ఓ... ఎస్. ఐ నో. షీ ఈజ్ మహాలక్ష్మీ ఫ్రమ్ భద్రాచలం. మీరు చాలా సార్లు చెప్పారుగా. అంతే కాదు. ఇటీవల ఒక మీటింగ్ లో హైదరాబాద్ లో చూశాను. కానీ మాట్లడ లేదు. వ్యక్తిగతమైన పరిచయం లేదు. ఆఉ చెప్పండి. '' సహజమైన ధోరణిలో గలగలా మాట్లాడేశాడు.
''మహాలక్ష్మి ! ఇతను వినరు. ఐఏఎస్ ఫ్రమ్ ఆంధ్ర. ఈ పాటికే నీకు అర్థమైవుంటుంది.''
''ఆ.... విన్నాను.'' ముక్తసరిగా అంది.
'' అమ్మా ! మహాలక్ష్మి ! ఈ మహాను భావుడు నీకు మల్లే ఒక ప్రణాలికతో వచ్చాడు. వినరు ! మహాలక్ష్మితో డిస్కస్ చెరు. ఈ విషయములో నేను మీకేమైనా సహయపడగలనా ? నా అవసరం ఉందనుకున్నప్పుడు నాకు కబురు చేయండి. ఈ లోపు ఇక్కడ నా పనులు అన్నీ పూర్తి చేసుకొని నెల రోజుల తరవాత హైదరాబాద్ లో ఉంటాను. ఓకే. మరిక ఉండనా?'' వినరు స్టైల్లో చెప్పి లేచాడు.
'' ఓకే. తప్పక కలుస్తాం. '' ఇద్దరూ ఒకే సారి ఒకే మాట అని లేచి వెళ్ళి పోయారు.
నెల రోజులు గిరుక్కున తిరిగి పోయాయి. అరుణ్ కుమార్ హైదారాబాద్ వచ్చేశారు. వారి సమక్షంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చాలా సాదాసీదాగా వినరు మహాలక్ష్మీల పెళ్ళి , అనేక మంది రాజకీయ నాయకుల, అదికారులతో వివాహ విందు కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిపోయింది.
అరుణ్ కుమార్ మరియు ఆయనతో పాటు పని చేసి రిటైరయిన మరి కొంత మంది అధికారులు భద్రాచలానికి అరవై కిలో మీటర్ల దూరంలో గోదావరి తీరాన ఉన్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల మరియు జూనియర్ కాలేజీలు దత్తత తీసుకొని అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయులకు తగు సూచనలు, సలహాలు ఇస్తూ, ఆదివాసీ విద్యార్థులకు ఆరోగ్యకరమైన భోజనంతో పాటు చక్కని విద్యను అందిస్తు ఉన్నారు. ఐదారు సంవత్సరాలు తిరిగే సరికి పదవ తరగతిలోనూ, ఇంటర్లోను రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. అంతటితో మహాలక్ష్మి తప్తి చెంద లేదు. ఛత్తీస్ ఘడ్ లో పని చేస్తున్న తన భర్త సహాయ సహకారాలతో, విజయనగరం నుండి, ఆదిలాబాద్ వరకు, ఛత్తీస్ ఘడ్ నుండి ఝర?ండ్, ఒడిస్సా వరకు విస్తరించి ఉన్న ఆదివాసి బిడ్డ లందరికి ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకు వచ్చారు. మేధావులు తలచుకుంటే చేయలేనిదేదీ లేదని నిరూపించారు. ఆశ్రమ డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, వైద్య కళాశాలలో ఈ ఐదు రాష్ట్రాలలో స్థాపించబడ్డాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి, ఒక ఆదివాసి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంలో, మహాలక్ష్మి, అరుణ్ కుమార్ల పాత్ర ప్రధానమైంది. ఒక ప్రక్క ఆదివాసీలు బాగా చదువుకుంటే వాళ్ళ వాగుల్ని, వంకలనీ, నదులనీ , భూముల్ని ఖనిజ సంపదను దోచుకోటం కుదరదని కార్పోరేటు వ్యవస్థలు, సంస్థలు బెదిరిస్తుంటే, ఆదివాసీ బిడ్డలు చదువులు బాగా చదువుకొని నగరాలకు, పట్టణాలకు వలస వెళ్ళి పోతే, తమ వ్యాపారులు బాగా సాగుతాయని, ఆదివాసీలకు ఎంతో చేశామని అటు పేరు ఇటు ఓట్లు వస్తాయని ఆలోచించే కొందరు ఒక దెబ్బకు రెండు పిట్ఠలు కొట్టవచ్చుననుకొని మహాలక్ష్మి వినరు వంటి ఆదివాసీ బిడ్డలు కోరిన కోరికలు తీరుస్తూనే తమ దోపిడీలు కొనసాగిస్తున్నారు. తాను ఒకటి తలిస్తే మరొకటి జరగటం సహజమేగా. తమ బిడ్డలు ముందు విద్యావంతులైతే, అధికారులైతే, ప్రజాప్రతినిధులైతే, తరువాత తమ బిడ్డలకు ఏం కావాలో వాళ్ళే నిర్ణయించుకుంటారని వీళ్ళ ఆలోచన.
ఇలాంటి ఆలోచనలతో సాధించిన దానితోనా సరి పెట్టుకోక ఆరు సంవత్సరాల క్రితం సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అరుణ్ కుమార్ సారధ్యంలో డిగ్రీలు, ఇంజనీరింగ్ లు, డాక్టర్ , టీచర్లను ఈ పరీక్షలకు సిద్ధం చేసి పంపిస్తున్నారు. మొదటి ప్రయత్నం లోనే మంచి ఫలితాలు సాధించారు. అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి సంవత్సరం ఐఏఎస్, ఐపిఎస్ లకు సెలెక్టు అవుతున్నారు. ఇంకా అనేక ఉన్నత ఉద్యోగాలలో ఆదివాసీ బిడ్డలు నియమిచబడుతూ వస్తున్నారు. రచయితలు, నటులు గాయకులు తయారయ్యారు. గత సంవత్సరం 'ప్రవలిక' అనే గోండు అమ్మాయికి గూగుల్ వాళ్ళు కోటి రూపాయల జీతం ఆఫర్ చేశారు.
ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నారనుకుంటుంటే తమ జాతి వారు దొరికిన ఉన్నత ఉద్యోగాలతో విలాసాలకు అలవాటు పడి తమ ఊళ్ళనే మరిచి పోతున్నారు. అడిగిన వెంటనే రోడ్లు, విద్యుత్తు, బడులు ఏర్పాట్లు చేసింది అటవి సంపదను దోచుకోటానికని చదువుకున్న మేధావులకూ అర్థం కావాటానికి కొంత సమయం పట్టింది. అర్థమయ్యాక కూడా తమతమ ప్రయాజనాలే ముఖ్యమనుకుంటే ఇక అడవి బిడ్డలను, సంపదను ఎవరు కాపాడాలి?
ఇక కవులు కళాకరులు, ఉపాధ్యాయులు , మేధావులు తమ ఆలోచనలను మార్చుకోవాలి.
తమ జాతి భాష సంస్కతితో పాటు అటవి సంపదను కార్పోరేటు దోపిడీదారులనుండి కాపాడుకోవాలి. అటు దళాలు, ఇటు పోలీసుల మధ్య బిక్కుబిక్కుమంటున్న ఆదివాసీలు. యుధ్ధ వాతావరణములో గిరిజన పల్లెలు. పోడు చేస్తీ జైలు. అయినా అడవులు ఎందుకు మాయమవుతున్నాయో తెలుసుకోలేని మైదాన ప్రజలు. చదువుకుంటే తలరాతులు మారతాయనుకుంటే, అడవి రూపురేఖలే మారుపోతున్నాయి. అరాకొర అభివృద్ధి. అది కూడా అడవి బిడ్డల ప్రయాజనాలకు కాదు.
మహాలక్ష్మి నిరంతరం ఇలాంటి ఆచనలతో, ఇంకా తన జాతికి ఏదో చేయాలనుకుంటుంటే, ఇంతలో ప్రపంచమంతా మాయదారి మహమ్మారి కరోనా వచ్చింది. టపాటపా జనాలు ఒక పక్క రాలి పోతుంటే, తమకు అనుకూలురైన అదికారుల్ని, అదికారాల్ని, చట్టాలను అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నారు. పెరట్లో లక్షలు, కోట్లు మొక్కలు నాటండని ఒక పక్క ఛాలెంజ్ లు, ప్రచారాలు, కోట్లకొద్ది ఖర్చు పేరుతో దోపిడి. మరో పక్క కార్పోరేటు వ్యవస్థకు యూరేనియం వంటి సంపదలను అప్పగించటం.
నగరాల నుండి పల్లెలకు విస్తరిస్తున్న కరోనా బారిన పడకుండా అడవి బిడ్డలను కాపాడుకోవాలి. ఇది ఇప్పుడు తన ముందున్న తక్షణ కర్తవ్యంగా భావించి , మహాలక్ష్మి అందుకు చేయవలసి ఏర్పాటులతో క్షణం తీరికలేకుండా రేయింబవళ్ళు గిరిజన గూడేల వెంట తిరుగుతుంది.
- మండవ సుబ్బారావు, 9493335150