Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వామి భక్తి పరాయణు డిగా, మీ ఉప్పు తింటున్న కారణంగా దోషిని పట్టించాలనే మంత్రితో చేయి కలిపాను, నమ్మించాను. మిమ్మల్ని కాపాడు కున్నాను. ఇటువంటి ద్రోహులు ఉన్నంత వరకు రాజ్యం అభివద్ధి చెందదు. తరతరాలుగా మీ కుటుంబానికి నమ్మకంగా ఉన్నాం. మా రాజును దక్కించు కున్నాం. ఆ తప్తి చాలు నాకు
కోసల రాజ్యం రాజు అవివేకి. మహామంత్రి అతనికి మాయ మాటలు చెప్పి, సమయం చూసి రాజును వధించి రాజు కావాలనే కుతంత్రాలు పన్నుతున్నాడు.
కానీ సేనాని వీర వర్మ అతని ప్రయత్నాలు నిర్వీర్యం చేస్తున్నాడు. సేనానిని మచ్చిక చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు మహామంర్రతి.
ఓ రోజు సేనాని గుర్రపుశాలలో ఉండగా మహామంత్రి వచ్చి ''వీర వర్మ ఇంకా ఎంత కాలం ఈ సేనాని బతుకు. ఈ అవివేకి రాజు ప్రజలకు సరైన పాలన అందించలేడు. పై హెచ్చు మనకు పక్క రాజ్యాలతో వైరం వచ్చి ఈ రాజ్యం అంతమై పోగలదు అందుకని...'' అంటూ ఆగాడు.
''చెప్పండి అందుకని'' అన్నాడు వీర వర్మ.
''నాతో చేయి కలుపు, అదను చూసి రాజును మట్టు పెట్టు. తర్వాత నేను మహారాజును, మీరు మహా మంత్రి సరేనా'' అన్నాడు.
దానికి వీర వర్మ ఆలోచించి ''నేను అదే ప్రయత్నంలో ఉన్నాను మహా మంత్రి. ఎంత కాలం ఈ సేనాని సేవ. రేపు రాజును ఉద్యాన వనంలోకి తీసుకువస్తా. అయితే రాజును వధించ వలసినది నువ్వే. తర్వాత ఎవరో దుండగులు రాజును చంపారని సాక్షిగా నేను ఉంటా'' అన్నాడు.
మహా మంత్రి విషపు నవ్వు నవ్వి ''నువ్వు ఆ పని చేయగల సమర్థుడవు. ఆలస్యం చేయక ఆ పనిలో ఉండు'' అని వెళ్ళాడు.
మరుసటిరోజు చంద్రోదయానా రాజు, సేనాని ఉద్యాన వనంలో అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటున్నారు.
''ఈ చల్లదనంలో వర్షం వస్తే బాగు బాగు కదా సేనాని'' అన్నాడు రాజు.
''అవును రాజా! వర్షం వస్తే మీరు తడుస్తారు. జలుబు, జ్వరం వస్తుంది .. అంటుండగా రాజు అడ్డు తగిలి ''తర్వాత మేము మరణిస్తాం'' అనగానే ''ఎప్పుడో ఎందుకు ఇప్పుడే నిన్ను వధిస్తా'' అని ఓ ముసుగు మనిషి రాజుపై దూకగా సేనాని ఒడుపుగా పట్టుకొని ''దుర్మార్గుడా! రాజు గారిపైనే హత్య ప్రయత్నం చేస్తావా రాజును చంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్నవా! ఎవరు నువ్వు'' అని ముసుగు తొలగించాడు.
ఎదురుగా మహా మంత్రి కనపడగానే రాజు నివ్వెర పోయాడు. మహామంత్రి సైగ చేస్తుండగా సేనాని నవ్వి ''రాజా! మీ అమాయకత్వం ఆసరాగా చేసుకుని మిమ్ములను వధించి ఈ రాజ్యానికి రాజు కావాలనే దుర్బుద్ధి మంత్రిది'' అన్నాడు.
దానికి మంత్రి ''కాదు రాజా! ఇతను కూడా మీ వధకు కుట్ర పన్నాడు'' అన్నాడు.
దానికి వీర వర్మ ''నిజమే, స్వామి భక్తి పరాయణుడిగా, మీ ఉప్పు తింటున్న కారణంగా దోషిని పట్టించాలనే మంత్రితో చేయి కలిపాను, నమ్మించాను. మిమ్మల్ని కాపాడుకున్నాను. ఇటువంటి ద్రోహులు ఉన్నంత వరకు రాజ్యం అభివద్ధి చెందదు. తరతరాలుగా మీ కుటుంబానికి నమ్మకంగా ఉన్నాం. మా రాజును దక్కించుకున్నాం. ఆ తప్తి చాలు నాకు'' అన్నాడు.
''అవును మీ వంశమంతా మాకు నమ్మకస్తులే. ఈ ద్రోహిని ఉరి తీయండి'' అని భటులను పిలిచి అప్పజెప్పాడు.
''నిజమైన సేనాని అంటే నువ్వే వీర వర్మ'' అంటూ ఆలింగనం చేసుకున్నాడు.
- కనుమ ఎల్లారెడ్డి
సెల్: 93915 23027