Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కప్పులో 'టీ' పోసి మురదర పెడుతూ, ''మీ పోలీసు పెద్దసార్ల ఇండ్లల్ల ఏమన్న పనురటే చెప్పరడి సార్. నాకూ, నా పిల్లగానికి ఇంత తిరడి, రక్షణ వురటే చాలు సార్'' అరది. నేను టీ తాగుతూ ఆలోచనలో పడ్డాను. నా ఎదురుగా వున్న ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌ను చేతుల్లోకి తీసుకుని చదవటం మొదలుపెట్టిరది.
''ఏం చదువుకున్నావ్?'' అడిగాను. పేపర్లో మొఖం తీయకురడా ''బి.టెక్'' అరది. వెరటనే తడబడి ''చదవాలనుకున్నా గానీ... చదవలేక పోయాను సార్'' అరది.
''ఇంకా పడుకోలేదా నాన్నా'' అరది. ఇంజనీరింగ్ ఫైనలియర్ ఫస్ట్ సెమ్‌లో వురది తనిప్పుడు.
''లేదమ్మా... నువ్వూ పడుకోలేదా'' అన్నాను. ''రేపు ఎసైన్మెరట్ సబ్మిట్ చెయ్యాలి నాన్నా.
వర్క్ చేస్తున్నా'' వయసుతో పాటూ వచ్చే 'పెద్ద రోగం' అబద్ధాలాడటం. చేస్తున్నది చెప్పరు.
చెప్పిరది చెయ్యరు. మోసం చేస్తున్నామనో, మోసపోతున్నామనో కనీస జ్ఞానం కూడా ఉండదిప్పటి
పిల్లలకు. పిల్లలు నిజమే చెప్పాలని కోరుకునే ఎందరో తండ్రులలో నేనొకణ్ణి. నా హౌదా
నాక్కొన్ని సౌకర్యాలిస్తురదేమో గానీ అరదరు తండ్రులకీ వచ్చే కష్టాలకు నేనేర అతీతం కాదు.
''హారు...''
''రోజుకు ఎన్నిసార్లు చెప్తావ్''
''ఒక్కసారే చెప్పాలని రూలేం లేదుగా...''
''లేట్‌నైట్ డిస్ట్రబ్ చేయకూడదని రూల్ పెట్టాలి నీలారటి వాళ్ల మీద''
''ఇప్పుడేగా మనసు విప్పి మాట్లాడుకునేది''
''మనసులో ఏం లేదు విప్పడానికి''
''పోనీ, ఇంకేమన్నా విప్పుతావా''
''ఆ! చెప్పులు''
''చెప్పులు విప్పితేనే కదా... మిగిలినవి విప్పేది''
''ఛీ... సిగ్గులేదా నీకు''
''చెప్పు... ఎప్పుడు విప్పుతావ్..?''
''రేపటి ప్రోగ్రామేరటీ..?''
''రేపు రేపే...''
''రేపా...''
''అవును 'రేపే'...''
పులిపంజా గట్టిగానే విసురుతోరది. శాన్వి ఆపద మురగిట నిలబడిందని అర్థమవుతురది.
తన ఫోన్ నురచి వచ్చిపోయే మెసేజ్‌లు ట్యాప్ చేసి చూస్తే ఒళ్లు జలదరిస్తురది.
టైం పదకొండయ్యిరది. శాన్వి తన బెడ్రూం నురచి బైటికొచ్చి ఫ్రిజ్‌లో వాటర్ బాటిల్ తీస్తూ ఆ వెలుతురులో లాప్టాప్ మురదు కూర్చున్న నన్ను చూసి...
''ఇంకా పడుకోలేదా నాన్నా'' అరది. ఇంజనీరింగ్ ఫైనలియర్ ఫస్ట్ సెమ్‌లో వురది తనిప్పుడు.
''లేదమ్మా... నువ్వూ పడుకోలేదా'' అన్నాను.
''రేపు ఎసైన్మెరట్ సబ్మిట్ చెయ్యాలి నాన్నా. వర్క్ చేస్తున్నా''
వయసుతో పాటూ వచ్చే 'పెద్ద రోగం' అబద్ధాలాడటం.
చేస్తున్నది చెప్పరు. చెప్పిరది చెయ్యరు.
మోసం చేస్తున్నామనో, మోసపోతున్నామనో కనీస జ్ఞానం కూడా ఉండదిప్పటి పిల్లలకు.
పిల్లలు నిజమే చెప్పాలని కోరుకునే ఎందరో తండ్రులలో నేనొకణ్ణి. నా హౌదా నాక్కొన్ని సౌకర్యాలిస్తురదేమో గానీ అరదరు తండ్రులకీ వచ్చే కష్టాలకు నేనేర అతీతం కాదు. శాన్వి ఈ మధ్య ఫోన్లో గంటల తరబడి ఛాటిరగ్ చెయ్యడం చూసే ఈ ట్యాపిరగ్ ఏర్పాటు చేశాను. తను లోపలికి వెళ్లిపోయాక సుమతి పడుకున్న తీరు చూశాను. ప్రపంచాన్ని మరిచిన చిన్నపిల్లలా ముడుచుకొని పడుకురది. పదేండ్ల క్రితం అప్పటికి ఆరేండ్ల వయసున్న వరుణ్ విషజ్వరంతో చనిపోయినప్పటి నురచే ఆమెకు కాలమూ, వయసూ స్తంభిరచిపోయినయి. ఆ రోజు హాస్పిటల్లోనే వరుణ్ బెడ్ పక్కనే వున్నట్టు మాట్లాడుతురదిప్పటికీ. కొన్నాళ్లు తనకు ట్రీట్మెరట్ చేయిర చినా తనతో ఎక్కువసేపు గడపటం, ఏదైనా వ్యాపకం చూపిరచటం మంచి దంటారు డాక్టర్లు.
వృత్తిరీత్యా నేనూ, చదువుతో పాటూ వయసుతో వచ్చే ఇతర వ్యాపకాలతో శాన్వి సుమతిని పట్టిరచుకోలేక పోతున్నార.
పండక్కి బట్టలు తెస్తే వరుణ్‌కు తేలేదేం అని ఏడుస్తురది. ఓపిక వురటే సముదాయిరచటం, లేకపోతే గద మాయిరచటం నాకు నిత్యకృత్యా లయినయి.
లైటార్పేసి పడుకున్నా శాన్వి భవిష్యత్ మీద బెంగ నిద్రపోనిచ్చేలా లేదు. త్వరగా దారిలోకి తెచ్చు కోవాల్సిరదే. రేపొక లేడీ కానిస్టేబుల్‌ను మఫ్టీలో కాలేజీకి పంపాల్సిరదే - శాన్వి మూవ్మెంట్స్ ఆరా తీయడానికి. తను రియలైజ్ అయ్యేదాకా కాపాడక తప్పదు. కనీసం నాకా సౌకర్యమైనా వురది. థారక్ గాడ్!
''ఎన్ని రోజులీ 'టీ' రుచి మాత్రమే చూపిస్తవ్ నూర్జహాన్. ఒక్కసారి 'మటన్ బిర్యానీ' రుచి చూడాలని నీ చేత్తో...''
కానిస్టేబుల్ నగేశ్ వంకర నవ్వులు విసురుతున్నాడు. 'టీ' అమ్ముకునే అమ్మాయి నూర్జహాన్‌తో.
ఆ అమ్మాయి ఏమీ మాట్లాడ లేదేమో... నాకే మాటలూ వినపడలే దామెవి.
''చెప్పు... ఎప్పుడు తినిపిస్తావ్?''
మాటలల్లో వగలూ వంకరలూ ఎక్కువైనయి.
''పోనీ... మీ ఇరటికి రానా? హి... హి...''
'డోంట్ టాలరేట్ హిమ్' నా మనసు హెచ్చరిరచిరది.
''నగేశ్'' గట్టిగా అరిచినట్టే పిలిచాను.
అతడు లోపలకి రావడం... నేను చెంపచెళ్లు మనిపిరచడం సెకన్లలో జరిగిపోయిరది. నిర్ఘాంతపోయి చూసిరది నూర్జహాన్.
''నీకేం భయం లేదు. వెళ్లు'' అన్నానామెతో.
నేను స్టేషన్‌కొచ్చి రెరడేరడ్ల యియిది. గత ఏడాది నురచే లోపలికొచ్చి 'టీ' అమ్ముకురటురది. అరతకు మురదు బైట చిన్నటేబుల్ మీద ప్లాస్క్ పెట్టుకొని కూర్చునేది. పోలీస్‌స్టేషన్ కదాని ఉద్దెర ఇవ్వదు మాకు. ఎప్పటికప్పుడు డబ్బులడిగి మరీ తీసుకురటురది.
రెరడు రోజుల తర్వాత నూర్జహాన్ 'టీ' తీసుకొని స్టేషన్లోకొచ్చిరది.
''భయం పోయిరదా?'' అడిగాను.
''నమ్మకం పెరిగిరది సార్'' అరది వినయంగా.
కప్పులో 'టీ' పోసి మురదర పెడుతూ, ''మీ పోలీసు పెద్దసార్ల ఇండ్లల్ల ఏమన్న పనురటే చెప్పరడి సార్. నాకూ, నా పిల్లగానికి ఇంత తిరడి, రక్షణ వురటే చాలు సార్'' అరది.
నేను టీ తాగుతూ ఆలోచనలో పడ్డాను.
నా ఎదురుగా వున్న ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌ను చేతుల్లోకి తీసుకుని చదవటం మొదలుపెట్టిరది.
''ఏం చదువుకున్నావ్?'' అడిగాను.
పేపర్లో మొఖం తీయకురడా ''బి.టెక్'' అరది.
వెరటనే తడబడి ''చదవాలనుకున్నా గానీ... చదవలేక పోయాను సార్'' అరది.
ఆమె 'సర్' అనాలనుకుని 'సార్' అని సాగదీయడమే చెప్తురది - ఆమె 'టెక్కీ' అని, ఆమె వెనకో కథ వురదని.
''రేపు ఆదివారం కదా. ఉదయం వెనక వున్న నా క్వార్టర్ దగ్గరికి రా'' చెప్పాను. ఒక్క క్షణం అనుమానంగా చూసినట్టనిపిరచిరది నాకు.
''ఫర్వాలేదు. ఇంట్లో నా భ్యా, బిడ్డా వురటారు'' అన్నాను.
నవ్వుతూ ''వస్తాను సర్'' అరది.
''సిఐ సర్...'' పిలుస్తున్నారెవరో అనుకొని బైటికొస్తే నూర్జహాన్.
బురఖాలో రాలేదు. చున్నీ మాత్రం నెత్తిమీదుగా దుపట్టాలా కప్పుకురది. ఛామనఛాయ, పెద్ద కళ్లు, అరదమైన కోలముఖం. తల్లి చేయి గట్టిగా పట్టుకున్న మూడేళ్ల పిల్లవాడు. రెరడు కనుబొమ్మలు కలిసిపోయాయే లేక బొట్టుపెట్టుకురదా అనిపిరచిరదొక్క సారి. అనుమానం లేదు అది బొట్టే.
లోపలికి రమ్మన్నాను.
హాల్లో నేనూ, శాన్వి, సుమతి.
''ఏ వూరు నూర్జహాన్ మీది?'' అడిగాను సంభాషణ మొదలుపెడుతూ.
''నూర్జహాన్ కాదు సార్... నా పేరు నీరజ'' అరది స్థిరంగా.
''మరెరదుకీ వేషం?'' అన్నాను కొత్త విషయం తెలుసుకోబోతున్నాననే ఆత్రంతో.
''చెప్తాను సర్. నా కథంతా చెప్తాను. అరతా విన్నాక నాకు మీరు పనిప్పిరచక పోయినా, నా ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు ఇప్పిస్తే చాలు సర్. మీకెప్పటికీ రుణపడి వురటాను'' అని చెప్పడం మొదలుపెట్టిరది.
''కాలేజీ పేరుతో రోజులో కొద్ది గంటలు దొరికే స్వేచ్ఛ. చెవులు మూసుకున్నా వినపడే చుట్టుపక్కల వారి స్వేచ్ఛా ప్రణయ కథలూ. అరదులో నిజాలెన్నో, అబద్ధాలెన్నో... తెలుసు కోలేని లేత వయసు అమాయకత్వర. అక్కడక్కడా విహరిస్తూ, విరహాన్ని దూరం చేసుకురటున్నట్టు కనిపిరచే జంటలు. వాళ్లు తేనెలొలికినట్టు మాట్లాడుకోవడాలు చూసి తెలియని ఈర్ష్య కలిగేది.
ఇంతలో ఒకడు నన్నే చూస్తున్నాడనే పులకిరత. నేనెక్కడికెళితే అక్కడికొస్తు న్నాడనే ఒకిరత గర్వం. మనసుకేదో ఆకలిగా వురది. ఏంటా ఆకలి? నేను అరదంగా వున్నానని చెప్పిరచుకోవాలనే ఆకలి. అమ్మకూ నాన్నకూ ఆ శ్రద్ధ లేదు. ఆ కేరింగ్ లేదు. నేను అరదంగా వున్నానని చెప్పే తీరిక లేదు. అమ్మ ప్రయివేట్ స్కూల్ టీచర్. నాన్న నూనె మిల్లులో గుమస్తా. కానీ నా చుట్టూ తిరుగుతున్న రారప్రసాద్కు నేనే లోకం. ఎంత అమాయకంగా మోస పోయాన్సార్.''
దుఃఖపు అల గొరతుని పూడ్చే సిరది. తిరిగి మొదలుపెట్టిరది.
''పులి వేటకూ... ఆడపిల్లను వేటాడే వాడికీ పెద్ద తేడా ఏం వురడదు సార్. చాలా శ్రద్ధగా వేటాడబడ్డాను సర్'' కాసేపాగిరది.
మంచినీళ్లిచ్చాను - నీళ్లతోపాటూ దుఃఖాన్ని దిగమిరగేయమన్నట్టు.
''ఎగ్జామ్స్ లాస్ట్ డే నాడు ఇద్దరం జంప్. హైద్రాబాద్ వెళ్లార. ఆటలాడుకున్నరత ఈజీగా స్నేహితులు మా పెళ్లి చేశారో గుళ్లో. కాపురం పెట్టడానికేర లేవు డబ్బులతని దగ్గర. కాని కోరికలు తీర్చుకునేరత బలమురదిగా. తీర్చుకున్నాడు. నా చెవుల కమ్మలు అమ్మాడు. ఒక నెల గడిచిరది. మెళ్లో చిన్నపాటి గొలుసు అమ్మాడు. మరో రెరడు నెలలు అతి కష్టం మీద గడిచినయి. ఇంజనీరింగ్ రిజల్ట్సు వచ్చురటయి. ఊరికెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకురదామన్నా. అప్పుడు చెప్పాడు... 'సారీ నీరూ. మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నాడట. పోలీసులు మన కోసం కాలేజీ దగ్గర నిఘా పెట్టారంట. సర్టిఫికెట్ల కోసం పోతే పట్టుబడతాం' అన్నాడు. నాన్న చనిపోయినందుకు దుఃఖపడ్డా. కానీ నా వయసు తొరదర ఎంత పని చేసిరదో అప్పటికీ నాకర్థం కాలేదు. నాకిరకా రారప్రసాద్ మీద నమ్మకమురదప్పటికీ. పోనీ ఏదన్నా ప్రయివేట్ జాబ్స్ చూసుకురదామన్నాను. సరేనని నా ఫోన్ అమ్మి మరో నాలుగు రోజులు బతికిరచాడు. అప్పటికే నాలుగు నెలలయ్యిరది ఇల్లొదిలి. ఒకరోజు పొద్దున్నే కళ్లు తిరిగి కిరదపడ్డాన్నేను. డాక్టర్ దగ్గరికి వెళ్దార ఆటో తెస్తానని వెళ్లినవాడు. రాత్రికి తాగి ఇంటి కొచ్చాడు. కడుపు తీయిరచుకోమనీ,
మనిద్దరం ఏం జరగనట్టే మనిళ్లకు వెళ్లిపోదామన్నాడు. అమ్మా నాన్న గుర్తొచ్చారు. నేను చేసిన పనికి నాన్న బలై పోగా... కడుపులో బిడ్డను చంపు కోవడమా? కుదరదన్నాను. విపరీతంగా కొట్టి బైటికి వెళ్లినోడు ఏదో పురుగులమందు డబ్బాతో వచ్చాడు. బాగా తాగున్నాడు. ఈ మందు తాగి చచ్చిపోదాం. మన పీడ మనకురడదు. ఇంకీ లోకానికసలే వురడదన్నాడు.
''లోకానికి నిన్ను గురిరచిన పట్టిరపేమీ వురడదు. అనవసరంగా దాని గురిరచి భయపడకు. మనకు దొరికిన చిన్న పనైనా చేసుకురటూ మురదు మన జీవితాన్ని మనం నిలబెట్టుకురదాం'' అని నచ్చ చెప్పబోయాను. రియల్లీ అసమర్థుడు సార్. నాలారటి వాళ్లెరదరో ఇలారటి మేకవన్నె పులుల్ని చూసి నిజంగా 'గొప్ప పులి'ని ప్రేమిరచాననని, అది నన్ను కాపాడుతురదనీ నమ్ముతారు.
చావడంకన్నా ఊరికెళ్లి పోవడమే మంచిదని బస్సెక్కాం. ఊరికి డైరెక్టుగా కాకురడా మధ్యలో ఈ టౌన్లో దిగేటట్టు టికెట్ కొన్నాడు. ఎందుకన్నాను. ఫ్రెండ్‌ను కలవాలన్నాడు. అతనను కున్నట్టు బస్టారడ్లో దిగాం. ఐదు నిమిషాల్లో మనిషి మాయం. రాత్రయ్యిరది. బీట్కొచ్చిన కానిస్టేబుల్ స్టేషన్‌కు తీసుకొచ్చాడు. వివరాలన్నీ తెలుసుకొని ఊరికి వెళ్లిపొమ్మన్నాడు. స్టేషన్ బైటికొచ్చి కూర్చున్నాను. ఎదురుగా హౌటల్. రోడ్డు దాటి వెళ్లి మెట్ల మీద సొమ్మసిల్లిన స్థితిలో కూర్చున్నాను. ఎవరో పుణ్యాత్ముడు టీ, బన్ను ఇప్పిరచాడు. బహుశా దేవుడేమో. కొరచెం తేరుకున్నా అక్కడే కూర్చున్నా. ఆ హౌటల్లోనే అరట్లు తోమే ఖాజాబీ ఆకేసుకోవడానికి బైటికొచ్చిన రెరడు సార్లూ నన్ను చూసిరదేమో... వివరాలడిగిరది.
పది నిమిషాల్లో నా కథంతా చెప్పాను. ఎక్కడికీ వెళ్లలేనీ, ఎక్కడా వురడలేని నా పరిస్థితికి జాలిపడిరదేమో ఆ దేవత. తానొక్కదాన్నే వురటానని తనతోపాటు తన ఇంట్లో ఉండమంది. తనతోపాటు అరట్లు కడిగే పనీ ఆ తరువాత కిచెన్‌లో కూరగాయలు కోయడం, వంట మాస్టర్‌కు సాయం చేయడం లారటి పనులిప్పిరచిరది. ఖాజాబీకి పిల్లలు లేరని వాళ్లాయన వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోయాడని చెప్పిరది. తల్లీ తండ్రీ మిగిల్చిన సగం కూలిపోయిన ఇంట్లోనే తనురడటమే కాదు... నాకాశ్రయమూ ఇచ్చిరది. గవర్నమెరట్ హాస్పిటల్లో నాకు పురుడు పోయిరచిరది. బాలింతనని చెప్పి మూడు నెలలూ కూర్చోబెట్టి సాకిరది. మానవత్వానికి నిలువెత్తు మూర్తి. అయితే నేను తనను కలిసి ఆశ్రయం పొరదిన రోజు నురడే నా రక్షణ కోసం నా పేరు నూర్జహాన్ అనీ, తను భద్రంగా దాచుకొని వురచుకున్న బురఖాలను ఇచ్చి కాపాడిరది. చిన్నపిల్లవాణ్ణి పెట్టుకొని హౌటల్లో పని చేయలేనని, పిల్లవాణ్ణి చూసుకురటూ పోలీస్‌స్టేషన్ మురదే టీ అమ్ముకునేలా హౌటల్ వాళ్లతో మాట్లాడి నాకా ఏర్పాటు చేసిరది సర్.''
తన కథంతా చెప్పుకొచ్చిరది నూర్జహాన్ అలియాస్ నీరజ. శాన్వి మొఖంలో నెత్తురుచుక్క లేదు. తన భవిష్యత్తేదో గోచరమైనట్టురది.
''వరుణ్! ఇలా రా!'' అరది నీరజ కొడుకును దగ్గరికి తీసుకురటూ సుమతి. వాడి బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపిరచిదొక్కసారిగా.
అలా చేయడంతో నీరజ తికమకపడిరది.
నేనూ నా విషాదాన్ని పంచుకోక తప్పలేదు నీరజతో.
''అమ్మగారిలా వున్నారు. వంటెవరు చేస్తారు సార్?'' అడిగిరది.
''శాన్వికి టైమూ, ఓపికా వున్నప్పుడు తను చేస్తురది. లేదంటే హౌటల్ నురడి క్యారియరే'' చెప్పాను.
''సర్... మీకు వంట చేసి పెడతాను సర్. నా బాబును స్కూల్లో చేర్చడానికి కేరాఫ్ అడ్రస్ లారటి చిన్న రక్షణ ఇవ్వరడి సార్. వంటగదిలోనే సర్దుకురటాను సర్'' అరది నీరజ.
సరేనన్నాను.
ఆరు నెలల్లో శాన్వి పూర్తిగా మారిపోయిరది. తన స్వరంలో గాంభీర్యర నన్ను కూడా భయపెడుతురదిప్పుడు. కరాఖండిగా, హురదాగా మాట్లాడుతురది. డిసిప్లిన్‌తో టైమ్ వృథా పోనివ్వకురడా చదువుకురటురది. మొదట్లో 'నీరజా' అని పిలిచే తనను ఇప్పుడు 'అక్కా' అని పిలుస్తురది. నీరజ సహకారంతో ఫైనలియర్లో గోల్డ్‌మెడలిస్ట్ అనిపిరచు కురది. ఎం.ఎస్.కు వెళ్తానన్న తన మాటను సివిల్స్‌వైపు మళ్లిరచిరది. అయితే సివిల్స్ వచ్చేలోగా తనను కొద్ది రోజులు ఎక్కడైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేయమని కోరిరది నీరజ. అదేమంటే 'నీ కంపెనీలోనే నాకో జాబ్ ఇప్పిరచగలవు కదా' అని దీనంగా అడిగిరది.
అప్పుడుగానీ నేను నీరజ సర్టిఫికెట్ల విషయం సీరియస్‌గా తీసుకోలేదు. ఒక హౌంగార్డును పంపి అక్కడి కాలేజీ యాజమాన్యర నంబర్లు తెప్పిరచుకొని, వాళ్లతో ఫోన్లో మాట్లాడి, సర్టిఫికెట్లు తెచ్చుకోమని నా కారిచ్చి నీరజను పంపాను. శాన్వి తోడుగా వెళ్తానంది. సర్టిఫికెట్లు తీసుకున్న తరువాత నీరజ ప్రాణం ఉగ్గబట్టలేక ఇంటికి వెళ్లి వాళ్లమ్మను కలిసిరది. మొదట కొన్ని నిష్టూరాలాడినా నీరజ కొడుకును దగ్గరకు తీసుకొని, పిల్లవాణ్ణి తనకిచ్చిపొమ్మని అడిగిరదట. త్వరలో తనే ఉద్యోగం చూసుకొని వచ్చి నిన్నే తీసుకొని వెళ్తానని తల్లికి నచ్చచెప్పిరది. రారప్రసాద్ గురిరచి ఎంక్వయిరీ చేస్తే ఇంజనీరిరగ్ ఫెయిల్ అయ్యాడని, ఎవరికో కారు డ్రైవర్‌గా పని చేసాడని, వాళ్లు కూడా తీసేసారని తెలిసిరదని చెప్పిరది.
నీరజ కోరుకున్నట్టే శాన్వి మొదట సాఫ్ట్వేర్ జాబ్ చూసుకురది. నేను అభ్యరతరపెట్టబోయాను, సివిల్స్ వైపు వెళ్లమని.
''నాన్నా... నీరజ చేసిన సాయానికి నా జీవితంలో ఒక సంవత్సరం నేను త్యాగం చేస్తే పోయేదేం లేదు కదా. తనను నా కంపెనీలోకి రికమండ్ చేసి జాబ్‌లో సెటిల్ చేస్తా. చూస్తురడండి'' అరది నమ్మకంగా.
ఇంకోవైపు సుమతి కూడా నీరజ కొడుకును కొంతకాలం 'వరుణ్' అని పిలిచినా... ఆ పిల్లవాని సాన్నిహిత్యరలో మానసికంగా బాగా కోలుకొని వాస్తవంలోకొచ్చిరది. విధిని అరగీకరిరచిరది.
కొద్ది నెలల్లోనే శాన్వి టీరలీడర్గా, నీరజ టీం మెంబర్‌గా సాఫ్ట్వేర్ జాబ్స్‌లో చేరారు. నీరజ వాళ్లమ్మను తెచ్చుకొని ఆమెకు కూడా ఊరటనిచ్చిరది. ఖాజాబీని కూడా తన దగ్గరే వురడమని కోరిరది మనస్ఫూర్తిగా. తనకు చేతకాని రోజు తప్పక వస్తానని చెప్పిరదామె. నిజంగా నీరజ మోసగింపబడ్డానని తెలిసిన రోజున ఆకలి గురిరచీ, కడుపులో బిడ్డను గురిరచీ ఆలోచిరచిరదేగానీ ఆత్మహత్య గురిరచి ఆలోచిరచలేదు.
దటీజ్ నీరజ... నూర్జహాన్నీరజ.
అన్నట్టు రారప్రసాదిప్పుడు నా కారు డ్రైవర్. బాగా సంస్కరిరచే పనిలో పడ్డాను.
(ఈ కథ రాసి పక్కన పెట్టిన మరుసటిరోజే పేపర్లో ఒక రియల్ స్టోరీ... ఇంచుమిరచుగా ఇలాగే వురది. 'కథను పక్కన పెట్టేద్దామా' అనిపిరచిరది. కానీ ఎన్నోసార్లు, ఎంతో మందికి చెప్పాల్సిన 'శకురతల'కథ లారటి కథ ఇది. అరదుకే ఈ కథ 'అన్నెశివ' ఎస్.ఐ (కేరళ) లారటి వారికి అరకితం.)
- కోట్ల వనజాత