Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఏందమ్మా మీరు మాకు చెప్పేది! మావి మాకేందో తెలుసు మీరు చెప్పడానికి వొస్తే వినడానికి ఎవరూ లేరు. ముందు బయటికి వెళ్ళండి'' అంటూ వారిని తరిమి కొట్టడానికి వొచ్చింది. ఎలా అయినా ఈ సమస్య నుంచి ఆ కుటుంబంలోని చిన్నారులు, వారి తల్లిని బయటపడేలా చేయాలనే ఆలోచన ఉండటం వల్ల ఆ తల్లి కూతుర్లని ఆ అత్త ఎన్ని మాటలు అన్నా అక్కడ నుండి కదల్లేదు..
''మీము ఇక్కడ నుంచి కదలం. మీకెలా అర్ధం అయ్యేలా చెప్పాలి. మళ్ళీ పెళ్లి చేసుకుంటే మీ ఇంటికి వచ్చే కొత్త కోడలు మీరు ఉంటున్న సొంత ఇంటి కోసం వొస్తుంది. మీకున్న ఈ కొంచం ఆస్తిని కూడా కడిగేసి వెళ్ళిపోతుంది'' అని త్రివేణి గట్టి కొంతుతో చెప్తుంది . ''వొచ్చినా ఈ పిల్లల్ని చూసుకుంటుందా? సొంత తల్లిలా ఉంటుందా చెప్పండి!
''మగవాడు లేని ఆడదానిబతుకు కుక్కలు చింపిన విస్తరి సునంద'' అంటూ టీవీలో వస్తున్న ''అరిటాకు జీవితం'' అనే దిక్కుమాలిన డైలీ సీరియల్ చూస్తూ టీ తాగుతున్నారు శాంత ఆమె కూతురు త్రివేణి. పక్కింటి పదేళ్ల పవన్ గాడు పరిగెత్తుకుంటూ వచ్చి ''అక్క ..అక్క ..కొంచం మా ఇంటికి రండి అక్క ఇంట్లో గొడవవుతుంది.. మా నాన్న రెండో పెళ్లి చేసుకుంటా అంటున్నాడు.. ఎవరు చెప్పిన వినట్లేదు. గొడవ చేస్తున్నాడు''.
''మీ నాన్నమ్మ ఇంట్లో లేదారా?'' రిమోట్‌తో టివి ఆఫ్ చేస్తూ అడిగింది త్రివేణి .
''ఉంది ఆ ముసలిది కూడా మా నాన్నని మళ్లీ పెళ్లి చేసుకో అంటుంది. మాకు భయమేస్తుంది అక్క ప్లీజ్ అక్క రా అక్క'' 'అని ఆయాసం తీర్చుకుంటూ మాట్లాడుతున్నాడు. వాడి మాటల్లో ఏడుపు, వణుకుతో కూడిన భయం, కోపం అన్ని కనిపిస్తున్నాయి. శాంత, ఆమె కూతురు త్రివేణి ఇద్దరూ కలిసి వారింటికి వెళ్లారు.
అప్పుడే తుఫాను వచ్చిపోయిన ప్రశాంతత కనిపిస్తుంది ఆ ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు .
''పవన్ గాడు చెప్పేది నిజమేనా, పిల్లలకు తల్లి ఉన్నా కూడా విడాకులు అవ్వకుండా మళ్ళీ పెళ్లి ఎలా చేస్తారు ?, పసి వాళ్ళు వాళ్లకేం తెలుసు పవన్ కంగారుగా ఏడుస్తూ వచ్చి చెప్తే అడగుదామని వచ్చాము'' ఎవరో ఒకరు ఆ నిశ్శబ్దాన్ని చేధించాలి కాబట్టి త్రివేణి గొంతు పెంచి మాటలు మొదలు పెట్టింది.
''ఇదేమైనా భావ్యంగా ఉందా మీకు. రెండో పెళ్లి చేసుకుంటే వొచ్చినామే ఆ చిన్నారుల్ని సరిగా చూసుకుంటుందా చెప్పండి?'' అంటూ త్రివేణి మాటలకు వంత కలిపింది శాంత.
దీన్ని గమనిస్తున్న ఆ చిన్నారుల తల్లి ''కాస్త అడగండి అమ్మా!'' చేతులు లేపలేని నిర్జీవ స్థితిలో ఉన్నా బలవంతంగా రెండు చేతులను జోడించి జాలిగా చూస్తున్న ఆ కళ్ళవైపు చూస్తే అర్ధం అవుతుంది. ఆమెలో ఏదో ఆశ కనిపించింది. రెండో వివాహం చేసుకుంటే జరిగే అనార్ధాల గురించి చెప్పి అత్త, భర్తలో మార్పు వొచ్చేలా చేసే వాళ్ళ ప్రయత్నం వాళ్ళది.
ఇద్దరు బాబుల నాన్నమ్మ ''ఏందమ్మా మీరు మాకు చెప్పేది! మావి మాకేందో తెలుసు మీరు చెప్పడానికి వొస్తే వినడానికి ఎవరూ లేరు. ముందు బయటికి వెళ్ళండి'' అంటూ వారిని తరిమి కొట్టడానికి వొచ్చింది. ఎలా అయినా ఈ సమస్య నుంచి ఆ కుటుంబంలోని చిన్నారులు, వారి తల్లిని బయటపడేలా చేయాలనే ఆలోచన ఉండటం వల్ల ఆ తల్లి కూతుర్లని ఆ అత్త ఎన్ని మాటలు అన్నా అక్కడ నుండి కదల్లేదు..
''మీము ఇక్కడ నుంచి కదలం. మీకెలా అర్ధం అయ్యేలా చెప్పాలి. మళ్ళీ పెళ్లి చేసుకుంటే మీ ఇంటికి వచ్చే కొత్త కోడలు మీరు ఉంటున్న సొంత ఇంటి కోసం వొస్తుంది. మీకున్న ఈ కొంచం ఆస్తిని కూడా కడిగేసి వెళ్ళిపోతుంది'' అని త్రివేణి గట్టి కొంతుతో చెప్తుంది .
''వొచ్చినా ఈ పిల్లల్ని చూసుకుంటుందా? సొంత తల్లిలా ఉంటుందా చెప్పండి!
అయినా మీ సమస్య ఏంటో అర్ధం అవ్వట్లేదు. ఎందుకు మీరు ఇలా చేద్దాం అనుకుంటున్నారు.'' శాంత వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంది .
కొంచం కోపం తగ్గిన అత్త ''నేను చెడ్డదాన్నైతే కాదమ్మా.. మీరు చూస్తూనే ఉన్నారుగా! నా కోడలు మంచిగా ఉన్నప్పుడు నాకు ఒక్క మెతుకు పెట్టలేదు..పెట్టినా సరే నానా తిట్లు తిట్టేది.. నా కొడుకు దొంగ చాటుగా వొచ్చి కూర వేస్తే ఇంట్లో ఉన్న కూర మొత్తం బయట పడేసి నేల పాలు చేసి గయ్యాలిగా ప్రవర్తించేది. నీనా నడవలేని పోలియో వ్యాధితో బాధపడుతున్నా ఉన్న ఇంటిని అద్దెకిచ్చి, నాకొచ్చే పెంక్షన్తో నా కొడుకును పెంచి పెద్దచేసిన. దీనికి ఏమో ఉన్నట్టుండి పిడుసులొచ్చి దావాఖాకి తీసుకుపోతే ఆ డాక్టర్లు మెదడులో రక్తం గడ్డ కట్టిందని, ఒక్కోసారి కాళ్ళు చేతులు కదల్లేని పరిస్థితిల్లో ఉండొచ్చు అన్నారు. ఇంటికి తీసు కొచ్చినాక ఆ డాక్టర్లు చెప్పినట్టే జరిగింది. కూర, బువ్వుండుడు, దీనికి సానం చేపిం చుడు, ముడ్డి కడు గుడు, నా మనువళ్ళ పని కొడుకు మీద పడింది. నానా చాకిరీ ఐతాంది నా కొడుక్కు ..నేనా ముందు ముందు చేతగాని దాన్ని ఐతున్న.. గందుకనే రెండో పెళ్లి చేస్తే వాడికి చాకిరీ తగ్గుతుంది.అందుకే పెళ్లి చేద్దాం అనుకుంటున్న'' అని తన మనసులోని సమస్యలు వాటి తాలూకు పరిణా మాలు పూసా కుచ్చినట్టు త్రివేణికి శాంతకు చెప్పింది. ఈ మాటలు అన్ని దీర్ఘంగా వింటున్న పవన్గాడి తల్లి చచ్చు పడిన నోటితోనే.'' ని..ని..నేను ఫని పని సాస్తా ఉవ్వ ఉవ్వ కదా వొందు వొందు వొందుతా'' అంటూ.. వణుకుతున్న చేతులతోనే బలవంతంగా గిన్నె తీసుకో బోయింది. గిన్నెకి బదులుగా పక్కనే ఉన్న కొడవలితో కట్టిన పొడవాటి కర్ర మీద పడింది.
''అయ్యో అయ్యో నా భార్య పద్మ'' అంటూ తల మీద తగిలిందేమో దగ్గరికి వెళ్లిన భర్తని వెనక్కి నెట్టింది. మొత్తానికి గిన్నెలో బియ్యం పోసి పక్షవాతం వొచ్చిన చేతితోనే బలవంతంగా బియ్యం కడగబోయింది.
''అయ్యో నువ్వు లేవలేకుండా ఉన్నావ్ కొలుకున్నాక చేద్దువు పద్మా పక్కకి పెట్టు'' అని అడగానికి వొచ్చిన తల్లి కూతుర్లు చెప్పినా వినడం లేదు.
అక్కడున్న కట్టెలను అంటుపెట్టి పోయి మీద బియ్యం పెట్టింది.
''నాను.. నాను. పనిలు ఫనులు సాస్తా మీరు పెళ్లి వొద్దు.. మన పిల్లలు.పిల్లలు.''అంటూ ఒకటే ఏడుపు.
ఆ ఏడుపుకి ఆ బజారు మొత్తం ఏమైందో అని బయట నుండి చూస్తూనే ఉన్నారు.
మా పరువు పోతది ఊరంతా తెలిస్తే అనుకుందో ఏమో పద్మ అత్త వెంటనే గొంతు పెంచి ''మా లొల్లులు మాకు ఉన్నాయి! ఎవరింట్లో లొల్లులులేవు. ఒకటే గుసగుసలు ఏదైనా అయితే సాలు. ఎంతైనా నా కోడలు నాకు కాకుండా పోతుందా? మా మనవళ్లు నాకు కాకుండా పోతారా? ఇంకోతి వొస్తే నా వోళ్ళకి ఉన్న జీవితం ఆగం ఐతదని నాకు తెలీదా? ఇంత లేవకుండా ఉన్న నా కోడలని బాగు చేసుకోవాలని సూత్త.. ఇప్పుడు సూత్తనే ఉన్నారుగా లెవలేని చేతులతో ఉన్నా .. కుటుంబం ఆగం ఐతది అని నా కోడలు పని చేస్తుంటే నా పానమంతా ఉసూరుమంటుంది.'' అని జాలిని కూడా కట్టుకొని అందరికి వినిపించేలా అరుస్తూ చెప్తుంది .
''కొడకా!ఇంకో పెళ్ళి విషయం ఇంకెప్పుడూ ఎత్తనుర నీభార్య గీ పరిస్థితుల్ల పని చేస్తుంటే ఎంత ప్రేమ సూపిత్తున్నావ్ కొడుకా.'' అని ఎంతో ప్రేమగా అంటుంది .'' నిజంగానే అంటుందా'' అన్నట్టు అడగటానికి వొచ్చిన తల్లి కూతుర్లుకి అనుమానం వచ్చిన అత్తలో మార్పుకి సంతోషించారు. అందరిముందు చెప్తుంది ా మళ్ళీ మరో పెళ్లి చేస్తారంటా అని నీ మనువొళ్ళు వొచ్చి ఏడిస్తే మీమైతే ఊరుకోము'' ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండమని చెప్పి వారింటికి తిరిగి ముఖం పట్టారు...
అంబులెన్స్ సౌండ్ ఆ ఏరియాలో వినిపిస్తుంది.. ఎవరింటికి వెళ్తుందని ఆ ఏరియా వాళ్ళు బయటికి వొచ్చి చూస్తున్నారు.
''ఆ కోడలు నేను బాగున్నప్పుడు నా అత్తని సరిగా చూసుకోలేదు. బాగుపడతుందన్న నమ్మకం నాకుంది.. సరిగ్గా ఉన్నప్పుడు ఎప్పుడూ మిమ్మల్ని చూసుకోకపోయినా మనసులో ఏమి పెట్టుకోకుండా నా మంచి గురించి ఆలోచిస్తున్న మీకు కృతజ్ఞతలు. ఇక నుంచి మిమ్మల్ని అమ్మలా చూసుకుంటా'' అంటూ మాటలు రాని మాటలతో కోడలు చెప్తుంటే అత్త మీరు బాగుండాలమ్మా అని కోడలికి సహాయం చేసే పనిలో లీనమైంది.
సాధారణంగా రోజులు గడుస్తున్నాయి. టీవీలో సీరియళ్లు మారుతున్నాయి. కొన్ని రోజులు గొడవలు లేకుండా ఉన్నాయి.. తర్వాత తర్వాత వారింట్లో గొడవలు జరగడం మామూలైంది.. ఎన్ని గోడవలైనా ఇంట్లో నా కోడలు, పిల్లలకోసం అయినా ఆరోగ్యం కుదుటపడి సంతోషంగా ఉంటే చాలు అనుకుంది.. విధి వైపరిత్యం అనుకోని పరిస్థితుల్లోకి నెట్టేసింది. తెల్లరితే ఇద్దరిలో చిన్నవాడిది పుట్టినరోజు.. అసలే కోమాలో ఉన్న అమ్మ ఆరోగ్య పరిస్థితి అయోమయంగా ఉంది.. పోయిన ఏడాది ఎంతో సంబరంగా అమ్మ, నాన్న, స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు.. ఈసారి కూడా సంతోషంగా చేసుకుంటే బాగుండని ఆ చిన్నోడికి ఉండదూ.. నాన్నేమో అమ్మని చూసుకునే పనిలోనే ఉన్నాడు.. వాడి పుట్టినరోజు ఎలా...? ఆ రోజే వొచ్చింది ఆ చిన్నోడి పెద్దమ్మ కూతురు.. అమ్ము అక్క అని ప్రేమగా పిలుస్తాడు..
వాడిని రెడీ చేసి అన్నదమ్ముల్ని ఇద్దరిని గుడికి తీసుకెళ్లింది..''కొబ్బరికాయ కొట్టుర'' అని వాడికి ఇస్తే ''ఊహు.. నేను కొట్టను అది పగలదు దాన్ని కొడుతుంటే నా చేతికి దెబ్బ తగులుతుంది'' అనగానే.. అక్కడ ఉన్నవాళ్లు ఒక్కటే నవ్వులు.. లోపలికి వెళ్ళాక పూజారి గోత్రనామాలు చదివి పూజ చేసాడు.. అమ్ము వాడి వైపు చూస్తూ ''మీ అమ్మకి మంచిగా ఉండాలి ..అని దేవుడికి దండం పెట్టుకోరా'' అంటూ చెప్తుంది..
పూజ అయ్యాక ఇంటికి బయలుదేరారు ఇంటికి రాగానే ఇంటిముందు అంబులెన్స్ ఏమై ఉంటుంది.. అన్నదమ్ములు లోపలికి వెళ్లారు అమ్మ నుండి మాట రావట్లేదు..''అమ్మ నా పుట్టినరోజు కదా నీకు ప్రసాదం తెచ్చాను తీసుకో..ఇంద బొట్టుపెట్టుకో'' అని అమ్మకి బొట్టు పెట్టాడు..అదే అమ్మకి చివరి రోజని ఆ కొడుకులు ఉహించి ఉండరు.
- పెద్దపల్లి తేజస్వి, 9603329474