Mon 13 Apr 23:45:25.012153 2015
Mon January 19, 2015 06:51:29 pm
నేటి నుంచి వీధినాటకోత్సవాలు
ప్రజాశక్తి- వైజాగ్ఫెస్ట్ ప్రాంగణం
వైజాగ్ఫెస్ట్ ప్రాంగణంలో ఈనెల 10న ప్రారంభమైన జానపద ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ నాలుగు రోజులపాటు వచ్చిన కళాప్రియులంతా జానపదాల విందును అత్యంత ఉత్సాహంగా ఆరగించారు. ఇదే వేదికపై మంగళవారం నుంచి వీధి నాటకోత్సవాలు ప్రారంభ కానున్నాయి. సోమవారం నిర్వహించిన జానపద ఉత్సవానికి పలు జిల్లాలకు చెందిన కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన మహిళలు ప్రదర్శించిన కోలాటం సభికులను ఎంతో ఉత్తేజపర్చింది. కళాకారుల వస్త్రధారణ పల్లెసంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. వారి నృత్యం తెలుగు సంప్రదాయానికి అద్దం పట్టింది. తెలంగాణా ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శారధ కధ సభికులను ఎంతో ఆలోచింపజేసింది.