Fri 17 Apr 12:15:54.44826 2015
Mon January 19, 2015 06:51:29 pm
విశాఖపట్నం : వైజాగ్ ఫెస్ట్ ను సందర్శించే పుస్తక ప్రియులకు నిర్వాహకులు చక్కని అవకాశాన్ని కల్పించారు. ఆఖరి మూడు రోజులు ఎంపిక చేసిన వారికి ఉచితంగా పుస్తకాలు అందజేస్తారు. 17, 18, 19వ తేదీల్లో కొనుగోలు చేసినవారికి ప్రత్యేకంగా కూపన్లు ఇస్తారు. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు డ్రా తీస్తారు. రోజు పదిమందిని ఎంపికజేసి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువైన పుస్తకాలను అందజేయనున్నారు. మూడు రోజుల పాటు మొత్తం 30 వేల రూపాయల పుస్తకాలు అందజేస్తారు. ఆసక్తి గలవారు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి పదిగంటల వరకు పుస్తక ప్రదర్శన సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.