Thu 16 Apr 01:34:38.334702 2015
Mon January 19, 2015 06:51:29 pm
ప్రముఖ సినీనటుడు వైజాగ్ ప్రసాద్
విశాఖపట్నం : కళాకారులు తలుచుకుంటే ప్రభుత్వాలు సైతం కూలిపోతాయని సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ అన్నారు. బుధవారం సాంస్కృతిక సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ... ఒకనాడు జానపద గేయాలు, వీధి నాటికలే జనాన్ని చైతన్యపరిచేవని గుర్తు చేశారు. ప్రజలను ఉత్తేజ పరిచినవారే కళాకారులన్నారు. అందుకే కళాకారులందరూ మూలాలు తెలుసుకోవాలని, ప్రజల్ని నిత్యం చైతన్యపరచడంలో పిఎన్ఎం ముందుందని కొనియాడారు. ఎయు విసి జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ.. ఈ ఫెస్ట్ తనకెంతో అనుభూతినిచ్చిందని, ప్రతియేటా దీన్ని నిర్వహిస్తే ఎయు మైదానం ఇచ్చేందుకు ముందుకొస్తామని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫెస్ట్ భవిష్యత్ తరానికి పునాది వంటిదని విజయ్ నిర్మాణ్ సంస్థ అధినేత విజయ్‌కుమార్ అన్నారు. నాటకరంగ సుప్రసిద్ధులు డాక్టర్ ఎడమ్స్ మాట్లాడుతూ... జానపద కళలు, వీధినాటికలనుంచే నేటి ఆధునిక చలనచిత్రాలు ఆవిర్భవించాయన్నారు. నేటి చిత్రాలకు జానపద సారంవుంటే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ, నాటక దర్శకులు కెజిఆర్ గాంధీని ఎయు విసి, వైజాగ్ ప్రసాద్, ఎడమ్స్ కలిసి ఘనంగా సన్మానించారు.