Wed 15 Apr 12:15:37.579488 2015
Mon January 19, 2015 06:51:29 pm
విశాఖపట్నం : అతనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అయినప్పటికీ సామాజిక బాధ్యత నిర్వహణలో ముందున్నానని తన ప్రత్యేకత చాటుకున్నాడు. ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మానవుని మనుగడ ఉంటుందని భావించి, చెట్లపై అమితమైన ప్రేమ పెంచుకున్నాడు. విశాఖపట్నానికి చెందిన ఇంటూరి భూషణం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 2008 నుంచి సామాజిక సేవలో భాగంగా ప్రతిరోజూ రెండు మొక్కలు నాటుతున్నాడు. హుదూద్ ప్రభావానికి విశాఖ కకావికలమైన నేపథ్యంలో 1000 మొక్కలు నాటి ప్రకృతిపై ఉన్న మక్కువను తెలియజేశాడు. ప్రధాన రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నాడు. నేను సైతం గో గ్రీన్.. మొక్కలు నాటుదాం, కాలుష్యాన్ని అరికడదాం.. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే ప్లకార్డులు శరీరంపై ధరించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. వైజాగ్ ఫెస్ట్ ప్రాంగణానికి వచ్చిన భూషణం.. చెట్లు నాటండి అంటూ ఫెస్టుకు వచ్చే సందర్శకులకు తన సందేశాన్ని అందిస్తున్నాడు.