Wed 15 Apr 01:59:33.150895 2015
Mon January 19, 2015 06:51:29 pm
జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్
విశాఖపట్నం : ప్రభుత్వ రంగ ప్రాధాన్యతను వైజాగ్ఫెస్ట్లో అడుగడుగునా కనిపిస్తోందని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. వైజాగ్ఫెస్ట్లో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక సంబరాల వేదికపై మంగళవారం వీధినాటకోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిషనర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పుస్తక ప్రదర్శన, పబ్లిక్‌సెక్టార్ పెవిలియన్, సర్ సివి రామన్ శస్త్రసాంకేతిక ప్రాంగణం తదితర స్టాల్ సందర్శించడం ద్వారా సమాజంపై లోతైన అవగాహన పెంచుకోవచ్చన్నారు. అనకాపల్లి ఎంపీ ముత్తశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి ప్రపంచీకరణ యుగంలో సగటు మనిషి ఊహలు, భ్రమల్లోపడి తన సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతున్నారన్నారు. ఇటువంటి తరుణంలో వైజాగ్‌ఫెస్ట్ పేరిట సాంస్కృతిక సంబరాలతోపాటు అనేక విజ్ఞానదాకయమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. షార్ట్‌ఫిల్మ్ పోటీ విజేతలకు ప్రముఖ సినీ దర్శకులు గీత కష్ణ, సినీ విమర్శకులు ఉమాశంకర్ చేతులమీదుగా బహుమతులను ప్రదానం చేశారు.
షార్ట్ ఫిల్మ్ విజేతలు వీరే
గాయం డైరెక్టర్ శ్రీనివాస్ ప్రథమ బహుమతి అందుకున్నారు. వన్‌అండ్ ఆఫ్ బ్రదర్స్ డైరెక్టర్ విజరుకుమార్‌కు ద్వితీయ బహుమతి, నమ్మలేని నిజం డైరెక్టర్ శ్రీనివాస్‌కు, మహేష్ థర్డ్‌క్లాస్ డైరెక్టర్ సంపత్ బొప్పాకు తృతీయ బహుమతి అందజేశారు. మట్టిపూలు డైరెక్టర్ వెంకట్, జస్ట్ ఫ్రండ్స్ డైరెక్టర్ చైతన్య, కప్ఫైనల్ డైరెక్టర్ అనిల్‌కుమార్, ప్లీజ్గాడ్ డైరెక్టర్ ప్రేమ్, బ్యూటీలైఫ్ ఇన్ హ్యేండ్స్ డైరెక్టర్ విజకుమార్ ప్రత్యేక బహుమతులు అందజేశారు.