Tue 14 Apr 00:25:06.059821 2015
Mon January 19, 2015 06:51:29 pm
తరలివచ్చిన యువతీయువకులు, విద్యార్థులు
విశాఖపట్నం : ప్రతిరోజూ ఫెస్ట్‌లో అదే ఉత్సాహం కనిపిస్తోంది. పిల్లలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో సోమవారం సాయంత్రం ఫెస్ట్‌కు తరలి వచ్చారు. సిపిఎం 21వ ఆలిండియా మహాసభలకు నేటి నుంచి విశాఖ నగరం వేదిక కావడంతో ఆ పార్టీ అగ్రనేతలు ప్రకాష్‌కారత్, సీతారాం ఏచూరి, తపన్‌సేన్, వామపక్ష నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, రామకృష్ణ, ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ నేత దేవబ్రత బిశ్వాస్, ఆర్ఎస్పి జాతీయ నాయకులు అబానీ తదితరులు ఫెస్ట్‌లో సోమవారం సందడి చేశారు. ప్రతి స్టాల్‌ను సందర్శిస్తూ ఇంత మంచి ఉత్సవం, విజ్ఞాన దాయక సముదాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో మంచి విషయమని అభివర్ణించారు. తాము కూడా ఎప్పుడూ ఇంత పెద్ద విజ్ఞానదాయక ఉత్సవ సందర్భాన్ని చూడలేదని ప్రకాష్‌కారత్, సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. సాంస్కృతికోత్సవాల వేదికపై ప్రదర్శించిన పలు రూపకాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వేదికపై నెల్లూరు జిల్లాకు చెందిన కళాకారులు మహిళా కోలాటం నిర్వహించారు. 5ఏళ్ల నుంచీ 60ఏళ్ల వరకూ మహిళలు నృత్యం చేయడం అందరినీ అలరించింది. సిఐటియూ ఆలిండియా జనరల్ సెక్రటరీ తపన్‌సేన్ పబ్లిక్ సెక్టార్ పెవిలియన్‌లో సెమినార్లో ప్రసంగిస్తూ ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ అత్యంత కీలకమని అన్నారు. ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య సాహిత్య సభలను ప్రారంభించారు. రామయ్య అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో ఫెస్ట్కొచ్చిన జనంలో అధికమంది ఆయన ప్రసంగిస్తున్న సభా వేదికకు వచ్చి కలుసుకునేందుకు ప్రయత్నించారు. సాంస్కృతిక కళావేదికపై హాస్యనటులు కోరుకొండ రంగారావును అతిథులు సత్కరించారు.