Tue 16 May 19:14:20.40597 2023
Mon January 19, 2015 06:51:29 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు తనకు ఆహ్వానం అందిందని, కానీ ఇలాంటి సినిమాలు (సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో వస్తున్న స్పై సినిమా) తీస్తున్న సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదనే ఉద్దేశ్యంతో తాను వెళ్లలేదని ప్రముఖ తెలుగు హీరో నిఖిల్ అన్నారు. తనను ఆహ్వానించినందుకు అమిత్ షాకు థ్యాంక్స్ చెప్పారు. నిఖిల్ హీరోగా గ్యారీ దర్శకత్వంలో స్పై సినిమా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా అతను మాట్లాడారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. జెండాలు, అజెండాలు లేవని చెప్పారు. తాను ఏ పార్టీకి అనుకూలంగా సినిమాలు చేయడం లేదన్నారు. ఒక భారతీయుడిగా సినిమా తీసుతున్నట్లు చెప్పారు. కేంద్రమంత్రులతో పాటు ప్రతిపక్ష నాయకులకు స్పై సినిమాను చూపిస్తామన్నారు.