Wed 17 May 15:16:38.850442 2023
Mon January 19, 2015 06:51:29 pm
నవతెలంగాణ - ఆంధ్రప్రదేశ్: గుంటూరు జిల్లా దాచపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం)లో తెలంగాణ వాసులు దుర్మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజన కూలీలు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలకు ఆటోలో వెళ్తుండగా లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్సను అందించాలని స్థానిక మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావును ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావులు ప్రమాద ఘటనను వివరించి తగు సహాయం చేయాలని కోరిన మేరకు చనిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి ఒక లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు.