Wed 17 May 08:50:17.920771 2023
Mon January 19, 2015 06:51:29 pm
నవతెలంగాణ- అమరావతి: విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయ సమీపంలోని ఆడిటోరియంలో మంగళవారం రోజ్గార్ మేళా జరిగింది. కార్యక్రమాన్ని దిల్లీ నుంచి ప్రధాని మోదీ ప్రారంభించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభం నుంచి మంత్రి వేదికపై కునికిపాట్లు తీస్తూ కనిపించారు. ప్రధానమంత్రి వచ్చి.. కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగిస్తున్నంతసేపూ కౌశల్ కిశోర్ నిద్రిస్తూనే ఉన్నారు. అధికారులు మధ్యమధ్యలో మంత్రిని మేల్కొల్పుతూ కనిపించారు.