Wed 17 May 09:46:04.55634 2023
Mon January 19, 2015 06:51:29 pm
నవతెలంగాణ - నంద్యాల: ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూమా అఖిలప్రియను నంద్యాల పీఎస్కు తరలించారు. నంద్యాల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమ అఖిలప్రియ అనుచరులు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే.. కిందపడిన ఆయనపై పిడిగుద్దులు కురింపించారు. మంగళవారం టీడీపీ నాయకుడు లోకేశ్ పాదయాత్ర సందర్భంగా నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో సుబ్బారెడ్డికి గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.