Tue 16 May 20:50:37.195614 2023
Mon January 19, 2015 06:51:29 pm
నవతెలంగాణ - హైదరాబాద్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను కుక్క కరిచింది. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ నెట్స్ లో కనిపించినా, ప్రాక్టీసుకు దూరంగా ఉన్నాడు. ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలో కసరత్తులు చేస్తున్న సమయంలో... అర్జున్ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు యుధ్ వీర్ సింగ్ చరక్ తో ముచ్చటించాడు. తనను కొన్నిరోజుల కింద కుక్క కరిచిన విషయాన్ని యుధ్ వీర్ సింగ్ తో పంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ పంచుకుంది. ఈ సీజన్ లో మొదట్లో కొన్ని మ్యాచ్ ల్లో ఆడే అవకాశం దక్కించుకున్న అర్జున్ టెండూల్కర్ ఆ తర్వాత రిజర్వ్ బెంచికే పరిమితమయ్యాడు. తొలుత పరాజయాలు ఎదుర్కొన్న ముంబయి... ఆ తర్వాత ప్రతి మ్యాచ్ ను సీరియస్ గా తీసుకుంటూ, జట్టు కూర్పుపై శ్రద్ధ చూపిస్తోంది. ఈ నేపథ్యంలో, సచిన్ తనయుడికి అవకాశాలు దక్కడంలేదు.