కథ
అతడు ఓ సమాధి దగ్గర నిలబడి ఉన్నాడు...
రాత్రి వెలుతురు అతడితో మాట్లాడసాగింది...
''ఇక్కడ సమాధి కెదురుగా నిలబడి నేను మాట్లాడలేను'' అన్నాడు అతడు.
''ఇక్కడెవెవరి సమాధి ఉన్నది?'' రాత్రి వెలుతురు ఎగిరి చూసింది.
''సమాధి పై ఎవరి పేరు లిఖి
అనగనగా జిలేబి అనే వనంలోకి కొత్తగా వంచిక అనే నక్క వచ్చి చేరింది. తన జిత్తులమారితనంతో తీయని మాటలు చెబుతూ ఎటువంటి శారీరక శ్రమ చేయకుండా ఆహారాన్ని సేకరించుకునేది. ఆహారం కోసం వనంలో ఉన్న జంతువులకు ఒకదానిపై మరొక దానికి చాడీలు చెప్పి తన పబ్బం గడుపుకునేది.<
నడి రేయి రాత్రిలో, నాలుగు దారుల కూడలిలో ఆమె నిర్వర్ణంగా నిలబడి ఉంది. ఆమె కళ్ళలోంచి వర్ణించడానికి ఆకాశం సిద్ధంగా ఉంది. చలి, విచిత్రంగా చూస్తున్న మగాళ్ల చూపులు చిరుగులుపడిన రవికలోంచి తనువుకు ఒకే
గోదావరి నది ఒడ్డునున్న ఏటిపాలెంలో ముప్పై మంది దాకా పల్లెకారులు చేపలు పట్టుకుని నివశిస్తుండేవారు. వారిలో గంగయ్య, గంగమ్మ అనే వృద్ధ దంపతులు పరమ ధార్మికులు. వారికి పిల్లలు లేరు. గంగయ్య చేపలను పట్టుకొస్తే, గంగమ్మ పక్కనున్న గ్రామాల్లో తిరిగి అమ్మి, వచ్చ
ఎదురు చూపులో ఇంత మాధుర్యం ఉంటుందా అనిపిస్తుంది ప్రవళికను చూస్తుంటే. రాసిన పదం మళ్ళీ రాయకుండ తన ప్రేమను లేఖల రూపంలో శతకం రాసింది. ఒక్కత్తే రూంలో ఉంటుంది. తనకు నచ్చిన పని చేస్తుంది. ఒక పని నచ్చలేదంటే దాన్ని అసలు ముట్టుకోదు. మందిలో ఎక్కువ కలువదు. సిగ
భూపతి అనే వర్తకుడివద్ద వ్యాపార విషయాలు చూస్తూ పనిచేసే వాడు చలమయ్య. వాడికి ఒకేసారి ధనవంతుడు కావాలనే దురాశ కలిగింది. వాడు పరంధామయ్య అనే వర్తకుడితో చేతులు కలిపి పథకం ప్రకారం ఓడలో సరుకు పరంధామయ్యకు అమ్మాడు. ఖాళీ ఓడను నీటముంచి సరుకు నీటిలో మునిగిపోయింద
- ఎనుగంటి వేణుగోపాల్, 9440236055
''ఏరా, కొండకు కొండలా ఉన్నావు. తోచినప్పుడు బడికి రాగానే సరిపోదు. బండ వెధవ! ఒక్క పద్యం కూడా రాకపోతే... ఎందుకురా?'' హుంకరించిండు నాగయ్య మాస్టారు.
విశ్వం తలవంచుకునే నిలబడి ఉన్నడు. చేతిల
ఆ సాయంత్రం పెరట్లో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్న గంగాధరంకి, ఓ కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది.
''హలో ఎవరండీ?'' లిఫ్ట్ చేసి అడిగాడు.
''హలో గంగాధరమేనా! మాట్లాడేది?''
రామయ్య చాలా తెలివిగలవాడు. అతడు చెరువు పల్లెలో నివసించేవాడు. ఒకసారి ఆ ఊళ్లో దొంగతనాలు ప్రారంభమైనాయి. రామయ్య తన ఇంటికి ఏ క్షణానైనా దొంగలు వస్తారని, దొంగతనం చేస్తారని అనుకున్నాడు.
అతడు అనుకున్నట్టే మరునాటి రాత్రి దొంగలు అతని ఇంటికి వచ్చారు. వారు
కళ్ళు కనురెప్పలను చూడలేవేమో కానీ కనురెప్ప ఎప్పుడూ కంటిని కనిపెట్టుకునే ఉంటుంది. తల్లి మనసూ అలాంటిదే! దూరంగా బిడ్డ ఉన్నా అతని క్షేమం కోసం అనుక్షణం ఆరాట పడుతూనే ఉంటుంది. ఆర్ద్రత నిండుగా ఉన్న ఆమె హృదయ భాండాగారంలోకి చూడగలిగే కొడుకులు ఎందరు?
''అమ్
సీను గాడి కళ్ళలో, కలల్లో కూడా ఆ చొక్కానే! ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. కళ్ళు మూసుకుంటే చొక్కా ఎక్కడ కనిపించదో అని భయం. పైగా ఆ చొక్కాని ఎదురుగా కనిపించే తాడు మీద వేసుకున్నాడు. ఇక అప్పటినుంచి కన్నార్పకుండా దానివైపే చూస్తున్నాడు. వాడికి నిద్
బ్రహ్మయ్య శాస్త్రికి భూమి లేకపోవడంతో మధుకరం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఓ సారి కృష్ణగిరి జమిందారును యాచించగా ఆవు పెయ్యను దానం ఇస్తూ ''కొద్ది రోజులు మేపుకున్నావంటే, కట్టి దూడను పెడుతుంది. మీకూ, మీ చిన్నపిల్లలకూ పాలు చక్కగా ఉపయోగపడతాయి'' అ
- నస్రీన్ ఖాన్,writernasreen@gmail.com
'ఓ.! అప్పుడే వచ్చేసిండే..!' మెయిన్ డోర్ ముందున్న భర్త చెప్పులను చూసి మనసులనే అనుకుంట లోపలికి అడుగుపెట్టింది సబా ఫాతిమా.
'ఎంతలా నిందిస్తున్నా సరే, ఓపికగా జవాబ
అదొక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. కౌసల్య టీచర్ మూడవతరగతి గదిలోకి అడుగు పెట్టగానే పిల్లలంతా లేచి నిలబడి ''నమస్కారం టీచర్'' అంటూ అభివాదం చేసారు. కౌసల్య టీచర్ ప్రతి నమస్కారం చేస్తూ.. అందరినీ కూర్చోమంది. పిల్లల హాజరు తీసుకుంది. ఆ రోజు చ
పొద్దూకిరతల ఇస్కూల్ నురటొస్తురటే చిన్నప్పటి సోపతి రాములు కలిశిరడు. జరసేపు మాట్లాడి జరిరత చారు తాపిచ్చి ఒదిలిచ్చుకొని వచ్చేవార్కె గిరత సేపాయె. మస్కచీకట్లు కమ్ముకోవట్టే. రివాజ్గ నయితే నేనిప్పటికే మా రూప వెట్టిన అటుకులో బొనుగులో తిని టి.వ
వంట జేసి బయట తిరగవోయిన కొడుకు ఆనంద్ కోసం ఎదురు జూస్తుంది తల్లి. ''పొద్దు పది దాటింది. ఈ పహిల్వాన్ యాడ గప్పాలు గొడుతుండో'' అనుకుంట సెంద్రమ్మ బజారుకు జూస్తే ఆనంద్ దోస్తు జగన్ కనిపించిండు. ''అరె ఓరి జగన్ జర యాడన్నా మా ఆన
రాజీ ఇవాళ బడికి పోలేదు. రమకి బళ్ళో ఏమీ తోచట్లేదు. తనకు చెప్పకుండా రాజీ ఎప్పుడూ బడి మానదు. ఇవాళ ఎందుకు చెప్పకుండా మానేసిందా అని ఆలోచిస్తోంది. భోజనాల గంట మోగే వరకు ఓపిక పట్టింది. గంట మోగగానే సంచీ భుజాన వేసుకుని రాజీ ఇంటికి బయల్దేరింది రమ.
ఊళ్ళో
''అరేయ్ రామిరెడ్డి, ఈ న్యూస్ చూసే ఉంటావు నిన్న రాత్రి హైదరాబాద్‌లో నాలుగేళ్ల పిల్లాడ్ని కుక్కలు దారుణంగా కొరికి చంపేసిన సంగతి.... వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఆ వీడియో కూడా చూశానురా... ఒళ్ళు జలదరిస్తోంది ఆ పసివాణ్ణి తలుచ
మూడ్రోజుల నుంచి వర్షం ఏకధాటిగా కురుస్తుంది. విత్తనాలేసే సమయంలో అదునకు వానలు కురవలేదు. ఇప్పుడేమో పండిన పంటలను మింగేస్తున్నయి. నర్సమ్మ ఊళ్లేకుపోయి వానలోనే ఇంట్లోకొచ్చి... ''ఈ వాన పాడుగాను
కొక్కొరోకో... కొక్కొరోకో...
ఈ కోళ్ల అరుపులు వినలేక చస్తున్నాం. తెల్లవారక ముందే లేచి ఒకటే అరుపులు. ఒక్కరోజైనా ప్రశాంతంగా నిద్ర పోనివ్వవు. వెధవ కోళ్లు. పెద్దలనే కాదు పిల్లలనూ పడుకోనివ్వవు. ఈ మాయదారి కోళ్ల బాధ ఎప్పుడు విరగడ అవుతుందో! రామాపురం గ్
పొద్దగాల ఆఫీసుకు బోయి ఫైళ్లు కేసులు హడావుడిగున్నపుడు నా కిటికీల నుంచి ఏందో లొల్లినవడ్తంది గానీ తేటగ లేదు మాట. నా దగ్గర పనిజేసే మీరతోని 'ఏందిలొల్లి' అని అడిగిన. లొల్లి మన గుడికాంచ
ఒక మృగరాజుకి బాగా ఆకలి వేస్తుంది. వేటకోసం అడవంతా గాలిస్తుంది. ఎంతసేపు వెతికినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. అటూ ఇటూ తిరుగుతూ చూసుకోకుండా బోయవాడు పన్నిన వలలో చిక్కుకుపోయింది.
బాగా ఆకలి... ఆపైన వలలో చిక్కినందుకు మృగరాజుకి చాలా కోపం వచ్చింది. కానీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నయి. అధికార పక్షం, ప్రతిపక్షం నాయకుల హడావుడి మొదలైంది. ఈసారి పోటీ గట్టిగానే ఉండేటట్లు ఉంది. పదవి కోసం ఎంతై
అంబలవనాన్ని పాలిస్తున్న రాజు క్షేమంకరుడు స్వతహాగా చిత్రకళ మీద అభిరుచి కలిగిన వాడు. అతని ఆస్థానంలో ఉండే విధురుడు అనే చిత్రకారుడు మరణించడంతో అతని స్థానంలో కొత్త చిత్రకారుని ఎంపిక కొరకు రాజ్యంలో దండోరా వేయించాడు. విషయం తెలుసుకున్న ఆ రాజ్యంలోని చిత్రక
కాలేజీలో నా లెక్చర్స్ ఐపోయాయి. ఇక ఏ కాస్త టైమ్ దొరికినా పైన లైబ్రరీకి వెళ్లి ఏదో రాసుకోవడమో, చదువుకోవడమో అలవాటైపోయింది. అలా ఎప్పటిలాగే ఈరోజు కూడా ఫ్రీ టైమ్ కదా
సాయంత్రం బడి నుంచి రాగానే త్వరగా ఫ్రెషప్ అయి రండి స్నాక్స్ తిని హోం వర్క్ చేద్దురు గానీ! ''అంటున్న తల్లిని ''అమ్మా! ప్లీజ్ అమ్మా! ఒక్క గంటసేపు చందూ వాళ్ళతో ఆడుకొని వస్తాను'' దీనంగా అడుగుతున్న నితీష్ వంక ఉరిమి చూసింది.
రైయ్యిమంటు బుల్లెట్ వేగంతో వచ్చి బైక్ పక్కగా ఆపి ముందుకు రెండడుగులు కదలి కుడిచేతి పైకెత్తి సెల్యూట్ చేస్తూ ''గుడ్ మార్నింగ్ సార్'' అంటూ పలకరించిండు.
''ఆ.. రావయ్యా హెడ్డు.. రా నీకోసమ
ఫ్లైట్ దిగి లగేజితో బైట అడుగుపెట్టిన కిరణ్‌ని అమాంతం చుట్టేశాడు శ్రీకాంత్.
ఎన్ని రోజులైంది రా చూసి. డిగ్రీ కాగానే ఎం.ఎస్ కని పోయావు. పెద్ద ఇంజనీరువై అయిదేళ్ల తర్వాత వచ్చావు అన్నాడు ఎడ్మెరింగ్&zw
ఆ రోజు సెలవురోజు కావడంతో నవీన్, అన్వేష్ ఇద్దరూ పవను వాళ్ళింటికి పోయి పవన్‌ని తోల్కొని రేన్వన్ల చెట్టుకాడికి పోయిన్రు. నవీన్, అన్వేష్, పవన్ వీళ్ళు ఒకటే స్కూల్లో ఏడో క్లాసు చదివే పిల్లలు. జిగిరి దోస్తులు. ఆ రేన్వ
రామయ్య అనే రైతు తన చేనులో జొన్న పంటను వేశాడు. అక్కడకు ఒక అడవి పంది వచ్చి ఆ జొన్న కంకులను తినుటయే కాకుండా ఆ కర్రలను తొక్కి అతని పంట అంతా నాశనం చేయసాగింది. సహజంగా జంతు ప్రేమికుడైన రామయ్య మర్నాడు ఉదయం ఆ అడవిపందిని చూసి కూడా ఏమీ అనలేదు. తర్వాత అది తాన
మృగరాజు సింహం గుహలో దిగాలుగా కూర్చొంది. ఇంతలో మంత్రి ఏనుగు లోనికి ప్రవేశించింది. దాని రాకను సింహం గమనించలేదు. 'మృగరాజా!' అని పిలిచింది. ఆ మాట కూడా సింహానికి వినపడలేదు. ఏనుగు తన స్వరాన్ని పెంచి మళ్లీ పిలిచింది. దాంతో సింహం ఈ లోకంలోకి వచ్చింది. ఏనుగ
చిన్న చీమల గుంపులాంటి ఓ విద్యార్థుల సమూహం నల్లగొండ నుంచి మాచర్ల వెళ్ళే బస్ ఎక్కింది. సీట్లలో కూర్చున్నరో లేదో... బస్సును కాస్తా క్లాస్ రూంగా మార్చేసారు. ఓ.. న్యూస్ పేపర్ తెగతిప్పేస్తున్నారు. ఇద్దరు సినిమా పేజీ చూస్త
అడవిలో అటు ఇటూ తిరుగుతున్న ఎలుగుబంటికి దారి మధ్యలో ఒక పచ్చలహారం దొరికింది. అది రాజుగారో లేక రాజోద్యోగులో ధరించేది. మరి అడవి మధ్యలోకి ఎలా వచ్చింది? ఎంత ఆలోచించినా అసలు విషయం అంతు పట్టలేదు ఎలుగు బంటికి. వేటకు వచ్చినవారి మెడలో నుండి జారిపోయి వుంటుంది
చాలా ఏళ్ల కిందట కొమరగిరి గ్రామంలో ఊదయ్య అనే చేపలు పట్టి జీవించే జాలరి ఉండేవాడు. తను స్వార్థం తెలియని నిజాయతీ గల మనిషి. ఓ పొడవాటి వెదురు కర్రకు చివరన గాలం కట్టి, దానికో చిన్న చేపను కుచ్చి బావుల్లో, కుంటల్లో, చెరువుల్లో వేట వేస్తూ, దగ్గరలోని పల్లెల్
సత్యం శివం సుందరం ఒక తల్లి సంతానం కాదు. ఒకే కుటుంబంలో వేరు వేరు తల్లులకు పుట్టిన వారు కాదు. అన్నదమ్ముల పిల్లలూ కాదు. వాళ్ళ బ్లడ్‌గ్రూప్‌లు కూడా ఒకటి కాదు.
సత్యం శివం సుందరం వేరు వేరు కులాలకు కుటుంబాలకు చెందిన వారైనా వారి మధ్య ఉన్న అ
రాజీ, సింధు, సమత ముగ్గురు మంచి స్నేహితులు. ముగ్గురు కలిసి మెలిసి ఉంటారు. బడిలో పాఠాలను ఎంతో శ్రద్ధగా వింటారు. ఇంటికి వెళ్ళిన తరువాత బోలెడు పనులు చేస్తారు. అమ్మానాన్నలు పనులకు వెళ్లి వచ్చే సరికి ఇంటి పనంతా చేసి, బడిలో చెప్పిన హోం వర్క్ చేసుకు
'ఏం పంచాతిరా పిలగా... ఊకూకెనే దేనికొస్తది చెప్పండి కొట్లాట మీకు. అన్నదమ్ములు ఇద్దరు రామలక్ష్మణులోలె కూడి ఉండక. తిన్నదరగకనా ఏంది. అట్లనే ఉంది మీ తీరు జూస్తుంటే. కడుపుకాలి ఒకడేడిస్తే, తిన్నదరగక ఇంకోడు పడిశిండంట. మీదీ అంతే. నిచ్చె జూస్తున్న.
ఒక రాజ్యంలో ఒక రాజుండేటోడు. ఆయనకు ఒక రోజు మూర్ఖులంటే ఎట్లా వుంటారో చూడాలి అనుకున్నడు. వెంటనే మంత్రిని పిలిపించి ''నాకు మూర్ఖులు ఎట్లా వుంటారో చూడాలని వుంది. నువ్వెట్లాగైనా సరే వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రానికల్లా మూర్ఖులని పట్టుకోనిరా'' అని ఆజ్ఞాపి
రాజావారు పొద్దున్నే నిద్దర లేచారు. నిద్దర లేచిన రాజావారు బాల్కనీలోకి వచ్చారు. బాల్కనీలోకి వచ్చిన రాజావారు పెద్ద కుర్చీలో కాలుమీద కాలు వేసుక్కూచున్నారు ఎప్పటిలాగే. ఎప్పటిలాగే చుట్ట వెలిగించారు. ఎప్పటిలాగే గుప్పుగుప్పు పొగలు వదలసాగారు.
సూర్యుడు
ఆరోజు మేఘాలు దట్టంగా కమ్మి జోరుగా వర్షం కురుస్తుంది. రాఘవరావు వేడివేడిగా కాఫీ చేసి దేవ్ రూమ్‌కి తీసుకువెళ్ళాడు. ''దేవ్.., లే నాన్నా తెల్లారింది'' అని తట్టి లేపాడు. దేవ్ పక్కన ఉన్న టేబుల్‌కి ఆనుకొని ఉన్న వాకింగ్&
ఓ పశువుల కాపరి గుంపులోంచి ఓ మేక పిల్ల తప్పి పోయింది. అది ఓ ముళ్ల పొదలో ఇరుక్కుపోయి అరుస్తూ ఉంది. అప్పటికే చీకటి పడుతోంది. అది అరుస్తూనే ఉంది. ఆ పొదకు సమీపానే ఓ చెట్టు పై కోతి చూసి ''అలా గట్టిగ
ఫోన్ రింగ్ అవుతోంది వంట గదిలో నుంచి హడావుడిగా వచ్చి ఫోన్ రిసీవ్ చేసింది మీనాక్షి, ''హలో ఎవరూ'' అంటూ అడిగింది. ''హర్షిత వున్నారాండి'' అవతలి నుం
స్టీల్ పల్లాలు పట్టుకొన్న విద్యార్థులు ఆకలి సమరంలో ఆయుధాలు ధరించిన యుద్ధ వీరుల్లా కనబడుతున్నారు. ప్రాకత వేషం ధరించిన అన్నపూర్ణమ్మలా లచ్చవ్వ అన్నం వడ్డిస్తుంటే అప్పుడప్పుడు అన్నం చెమ్చ
గోడలుగా గుంజలు, ప్రహరీలుగా కర్రలు... ఇళ్ళ కప్పుగా వాసాలు.. మట్టిలో పాతబడిన కలపతో మొలిచి నిలుచున్న మొగరాల్లా ఉంది ఆ గూడెం.. ఎటుచూసినా దట్టమైన పచ్చదనం.. మనుషులు మాత్రం మట్టిరంగులో ఉన్నార
చంద్రవంక అనే అడవిలో చిట్టీ అనే కుందేలు ఉండేది. పాఠశాల ఎగ్గొట్టి తన స్నేహితులైన నక్క, కోతితో కలిసి అడవి మొత్తం తిరిగేది. చేతికి ఎదిగొస్తున్న కొడుకు బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి సమాజంలో మంచి స్థానం పొందుతాడు అనుకున్న చిట్టీ ఇలా స్నేహితులతో కలిసి
ఒక జింక పిల్ల మర్రి చెట్టు ఊడలు పట్టుకుని పాటలు పాడుకుంటూ ఊయలూగుతుంది. పొరపాటుగా చెయ్యి పట్టు తప్పి కింద బురద గుంటలో పడిపోయింది. అందులో నుండి పైకి రావడానికి ఎంత ప్రయత్నించినా రాలేకపోతుంది. ఎవరయినా అటుగా వస్తే చెయ్యి పట్టుకొని పైకి లాగుతారని ఎదురు
అర్పణ ఒక 15 ఏళ్ల అమ్మాయి. తను చాలా అందంగా ఉంటుంది. తనొక అనాథ. థెరిసా ఆశ్రమంలో పెరుగుతుంది. పిల్లలు చిన్న చిన్న విషయాలు కూడా ఉత్సాహపడి ఆనందానుభూతులకు లోనవుతారు. అది పిల్లలకు ఉండే గొప్ప గుణం. అలాగే అర్పణ కూడా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండేది.
''రాణి
ఒక మామిడి చెట్టు చాలా అహంకారం కలది. అది తన దరిదాపుల్లో ఉన్న ఒక బచ్చలి కూరను, ఒక బెండకాయ మొక్కను, ఒక గడ్డి పరకను చూసి ఎప్పుడూ అవమానకరంగా మాట్లాడేది. అయినా అవి ఒక్కనాడు కూడా దానిని ఏమీ అనలేదు.
ఒకరోజు బాగుగా గాలి వీచింది. ఆ గాలికి బచ్చలి భయంతో త
'నాన్నా! జాతరకు పోదామని'' పిల్లలు బలవంత పెట్టడంతో సతీసమేతంగా బయలుదేరక తప్పలేదు. జాతర దగ్గర జనం తండోపతండాలుగా ఉన్నారు. అక్కడ ఉగ్రరూపంతో నున్న అమ్మవారిని శాంతపర్చడానికి పరాయి తలలు తాకట్టుపెడుతున్నారు. తాకట్టుపెట్టిన మూగ తలలు మౌనంగా తెగి దూరం
జయంతిపురాన్ని పాలిస్తున్న రాజు కమల వర్ధనుడు. గొప్ప వీరుడు, పరిపాలనా దక్షుడు. అతనికి కుమారులు లేరు. దమయంతి దేవి అనే కుమార్తె మాత్రమే ఉంది. మహారాజు రాజ్యభారాన్ని కుమార్తెకు అప్పజెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా, ఆమె వద్దని తిరస్కరించేది! ఈ విషయంలో