Authorization
Thu March 20, 2025 09:50:19 pm
నవతెలంగాణ-కుల్కచర్ల
ఎంపీటీసీల డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి కోస్గి వెంకట్ అన్నారు. స్థానిక సంస్థలకు రూ. 500 కోట్ల నిధులు కేటాయింపు జరగడంతో కీలక పాత్ర పోషించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నగరంలోని ఆమె నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవా దాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీటీసీల కు సంబంధించిన మరిన్ని డిమాండ్లను కూడా త్వరలో పరిష్కరించేలా చూస్తామని మాట ఇచ్చారన్నారు.