Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిమ్మాపూర్లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
- ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
కంటి వెలుగు నిరుపేదలకు వెలుగు నిస్తుందని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కొత్తూరు ము న్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ అ న్నారు. బుధవారం ఆమె కొత్తూరు మున్సిపాలిటీ పరిధి లోని తిమ్మాపూర్లో గల ప్రాథమిక పాఠశాలలో కౌన్సిలర్ చింత కింది చంద్రకళ రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసు కొని అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి వెలుగు ద్వారా ఎంతో మంది నిరుపేదల జీవితాలలో వెలు గులు వస్తాయని పేర్కొన్నారు. యువత ప్రతి ఒక్కరికీ స మాచారం అందించి చికిత్స అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈటా గణేష్, వైస్ చైర్మన్ డోలి రవీందర్ కౌన్సిలర్, కోస్గి శ్రీనివాస్, ఎంపీటీసీ చింతకింది రాజేందర్ గౌడ్, నాయకులు బాతుక దేవేందర్ యాదవ్, ఏనుగు జనార్దన్ రెడ్డి, డాక్టర్ హరి కిషన్, ఆశా, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, గ్రామ స్తులు, యువకులు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.