Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల, అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ-షాద్ నగర్
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించకుంటే ప్రజాసంఘాల అఖిలపక్ష రాజకీయ పార్టీల ఐక్య కార్యాచరణతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రజా సంఘాలు అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం షాద్నగర్ పట్టణంలోని పెన్షనర్ భవన్లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనకై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రజాసంఘాల నేతలు అఖిలపక్ష రాజకీయ పాల్గొన్నారు. ప్రజా సంఘాల నాయకులు అర్జునప్పా ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ రాఘవ చారి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తే ఇక్కడి రైతాంగానికి వ్యవసాయానికి సాగునీరు తాగునీరు అందుతుందని అన్నారు. గత ఎన్నికల్లో పాలకులు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కచ్చితంగా నిర్మిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న పాలకులు ఇప్పుడు ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని కుర్చీ వేసుకుని కడతానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నిర్మాణ పనులు చేపట్టలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య అసెంబ్లీలో ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. సాగునీటి రంగంపై ఆధారపడిన నియోజకవర్గంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తేనే సస్యశ్యామలం అవుతుందని వారు అన్నారు. కానీ ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రవీంద్రనాథ్ నర్సింలు, కష్ణ, నర్సింలు గౌడ్, టీజీ శ్రీనివాస్, మాదరం నర్సింలు, తిరుమలయ్య, కాంగ్రెస్ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్, తెలంగాణ లోక్ సత్త రాష్ట్ర అధ్యక్షులు మన్నారం నాగరాజు, సీపీఐ(ఎం) నాయకులు ఈశ్వర్, శ్రీను నాయక్, సిపిఐ నాయకులు బుద్ధుల జంగయ్య, బీఎస్పీ నాయకులు దొడ్డి శ్రీనివాస్, పసుపుల ప్రశాంత్, వైయస్ అర్టిపి నాయకులు ఇబ్రహీం, భూస జంగాయ,శీలం శ్రీను, కాంగ్రెస్ నాయకులు బాబరాన్, జాకారం శేఖర్, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, సీతారాం, రాజు సత్యనారాయణరెడ్డి, పిట్ట రజిత వెంకటయ్య, రఘు, తదితరులు పాల్గొన్నారు.