Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్రెడ్డి రంగా రెడ్డి
నవతెలంగాణ-మంచాల
కార్యకర్తల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం అని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బుగ్గ తండాలో ప్ర మాదంలో చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్ర మాద బీమా చెక్కులు మల్రెడ్డి రంగారెడ్డి అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాం గ్రెస్ అంటే ఒక కుటుంబమని ప్రతి కార్యకర్తనూ ఒక కు టుంబ సభ్యునిలాగా భావించి సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకూ ప్రమాద బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి నా యకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకు సంక్షేమ విషయంలో ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అందులో భాగం గానే బుధవారం మండల పరిధిలోని ఆరుట్ల అనుబంధ గ్రామమైన బుగ్గ తండాకు చెందిన ప్రమాదంలో మృతి చెందిన సపావట్ లక్ష్మి కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కు ను అందజేశారని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మదు సుధన్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎంపీపీ గుండె మొని జయమ్మ, ఎం పీటీసీల ఫోరం మండలాధ్యక్షులు ఎడమ నరేందర్, లిం గంపల్లి ఎంపీటీసీ పల్లాటి జయనందం, పీఏసీఎస్ డైరక్టర్ వేదిరే హనుమంతు రెడ్డి తదితరులున్నారు.