Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకరపల్లి
శంకర్పల్లి మండలంలోని ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు గోపాల్ నాయక్ కూతురు సహర్ష ప్రమోద్ కుమార్, మిర్జాగూడకు చెందిన ఒగ్గు అంజయ్య కూతురు భార్గవి సాయి కుమారుల పెండ్లి వేడుకల్లో పాల్గొని నవ దంపతులను చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్‌గౌడ్ ఆదివారం ఆశీర్వదించారు. వారితోపాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కావలి గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పాపారావు, కురుమ వెంకటేష్, సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, మిర్జాగూడ ఉప సర్పంచ్ శాంతికిషన్ సింగ్ వార్డు సభ్యులు వై. ప్రవీణ్ కుమార్, వై. చిట్టమ్మ శారద, కమలమ్మ, కోట రాజు గౌడ్, పి. సురేందర్ రెడ్డి, నాయకులు నరసింహగౌడ్, సిహెచ్ కుమార్, రవి, దృఢచారి ద్రోణాచారి, తిరుపతయ్య, గణేష్, ఒగ్గు మల్లేష్, ఐలయ్య, తదితరులు ఉన్నారు.