Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తూరు
ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పెంట నోళ్ళ రవికుమార్ తండ్రి మిద్దె కిష్టయ్య అనారోగ్యంతో బాధపడు తూ గత సంవత్సరం డిసెంబర్లో చనిపోయాడు. దీంతో ఆదివారం ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆయన స్వగ్రామం ఇముల్ నర్వాలోని నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇతర రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ నిర్మాణ కార్యక్రమాలు ఎక్కువగా ఉండడంతో అంత్యక్రియలకు రాలేకపోయానని ఆయన వాపోయారు. అధైర్య పడొద్దని ఎమ్మార్పీఎస్ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. అతనితోపాటు ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు మదిలేటి మాదిగ, రావు గల బాబు మాదిగ, బక్కన్ రవి మాదిగ, పోతుగంటి కృష్ణ, ఇప్పలపల్లి దర్శన్, నరేందర్, ప్రేమ్ కుమార్, అశోక్, సురేష్, అశోక్ బక్కని తదితరులు ఉన్నారు.