Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతీ గ్రామం, తాండాలకు సైతం రూ.50 లక్షలు మంజూరు
- 'పల్లెపల్లెకూ పైలెట్' కార్యక్రమంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
- 12 వందలకు పైగా ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
తాండూరు అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే పైలెట్ రోహి త్‌రెడ్డి దూసుకుపోతున్నారు. నియోజక వర్గం రూపురేఖ లు మార్చి చూపిస్తానని తాను ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులకు శ్రీకారం చూడుతున్నారు. తాండూరు నియోజకవర్గం చరిత్రలోనే 40 ఏండ్లుగా ఎవ్వరూ చేయలేని అభివృద్ధిని చేసి చూపిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నియోజకవర్గానికి ఏకంగా రూ.134 కోట్లు తీసికొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. 'పల్లెపల్లెకూ పైలెట్' కార్యక్రమంతో గ్రామాలు, తాండాల్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే.. సీసీరోడ్లు, మురుగు కాల్వలు, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల కో సం శంకుస్థాపనలు చేశారు. పగలనకా.. రాత్రనకా పర్య టించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ప్రజలు ఘన స్వా గతం పలుకుతున్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధి పను లను అంతకు ముందున్న ఏ నాయకుడూ చేయలేదని ప్రతీ గ్రామంలో చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రతీ గ్రామానికి రూ.50లక్షలతో పనులను ప్రారంభించడానికి పెద్ద ఎత్తున 12 వందలకు పైగా ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. దీంతో త్వరలోనే ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యి తాండూరు పట్టణంతోపాటు ప్రతీ గ్రామం, తాండాల రూపురేఖలు మారనున్నాయి.