Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
కర్నాటక రాష్ట్రంలో విద్వేషం ఊడిందని ప్రేమ గెలి చిందని, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి రావడం ఖాయమని టీపీసీసీ ప్రతినిధి ఎండి యూ సుఫ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, కొడంగల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ రెడ్డి, కొ డంగల్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ దాము, పట్టణా ధ్య క్షులు నయుంలు అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ విజయం తో కొడంగల్‌లోని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి నివాసం నుండి అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహా నికి పూలమాలవేసి వినాయక చౌరస్తా వరకు నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి టపాకులు పేలుస్తూ, స్వీట్లు పంచుకొని సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు అన్నారు. కాంగ్రెస్‌పై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించి అద్భుతమైన విజయం అందించారన్నారు. బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలపై వేసిన భారాన్ని ఈ ఎన్నికలలో ఓట్ల ప్రభావం కనిపించిందన్నారు. ప్రధాని మోదీ స్వయంగా రోడ్‌షో చేసిన ప్రజలు నమ్మలేదని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుందన్నారు. మతోన్మాద బీజేపీ అధికారంలో కి వచ్చేందుకు ఎంతో ప్రయత్నాలు చేసిందని, ఆ ప్రయ త్నాలు ప్రజలు తిప్పి కొట్టారన్నారు. కర్నాటకలో ప్రజాస్వా మ్యం గెలిచిందన్నారు. విద్వేషం ఊడిందని ప్రేమ గెలిచిం దన్నారు. కార్యక్రమంలో కొడంగల్ పట్టణాధ్యక్షులు న యుం, కొడంగల్ మండల కార్యదర్శి బాల్ రాజ్, కౌన్సిలర్ శంకర్ నాయక్, మైనార్టీ సెల్ ఆసిఫ్ ఖాన్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాము, ప్రకాష్ రాజు, సోమశేఖర్, తార్య నాయ క్, రాజు తదితరులు పాల్గొన్నారు.