Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస మండల అధ్యక్షులు ఆవుల యాదయ్య
నవతెలంగాణ-మంచాల
ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఆవుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోని తాళ్ళపల్లి గూడ గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు 12 వారాల నుండి డబ్బులు రాకపోవడం వల్ల ఉపాధి కూలీలు చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి హామీ కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో ఎంపిడిఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.