Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు పెరిగిన ఆదరణ
- భవిష్యత్తులో కాంగ్రెస్కు పూర్వ వైభవం
- కాంగ్రెస్ మండలాధ్యక్షులు మాలి.విజరు కుమార్ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కర్నాటక ఫలితాల అనంతరం సరికొత్త మార్పులు రావడం ఖాయమని కాంగ్రెస్ దోమ మండలాధ్యక్షులు మాలి.విజరు కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 224 స్థానాల్లో 136 స్థానాలను కాంగ్రెస్కు ఇవ్వడం ద్వారా కర్నాటక ప్రజలు తిరుగులేని ప్రజాస్వామ్య నిర్ణయాన్ని ప్రకటించి చరిత్ర సృష్టించారని తెలిపారు. బీజేపీని 65 స్థానాలకు పరిమితం చేసి ప్రజావ్యతిరేక శక్తులకు మరచిపోలేని గుణపాఠాన్ని కర్నాటక ఓటర్లు నేర్పించరాని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు ఆ పార్టీని దెబ్బతీస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు పెరిగిన ఆదరణ భవిష్యత్తులో పార్టీకి పూర్వ వైభవం వచ్చే సూచనలను స్పష్టం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఘన విజయం ప్రతీ సామాన్య కార్యకర్త, నాయకుడి శ్రమ ఫలితమేనని అన్నారు.