Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ సీనియర్ నాయకులు ఇందనూర్ బషీర్
నవతెలంగాణ-కొడంగల్
ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలను ఎండగడుతూ మరోవైపు రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యం లో ఏప్రిల్ 14 నుంచి 'ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని సీపీఐ సీనియర్ నాయకులు ఇందనూ రు బషీర్ అన్నారు, కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగం గా కొడంగల్, బొంరాస్పేట్ మండలాల్లో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విధానాల వలన దేశంలోని వివిధ రంగా ల్లో జరుగుతున్న అన్యాయాలను, దేశ సమైక్యతకు, సమ గ్రతకు ప్రమాదం వివరించారన్నారు. రాజ్యాంగం ప్రసా దించిన లౌకిక వ్యవస్థకు విఘాతం కలిగిస్తూ హిందూ మతాన్ని హిందుత్వంగా మారుస్తూ పరమత సహనాన్ని ధ్వంసం చేస్తుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని అమలుపరిచేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నావన్నారు. మతాలు, కులా లు భాష పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరు గుతుందన్నారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత దేశాన్ని ఏం తినాలి, ఏం బట్ట కట్టాలి అనే విషయాల దగ్గర నుండి అన్ని అంశాల్లోనూ నిరంకుశ విధానాలు బీజేపీ తీసుకువచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రశ్నించే వారిని జైలల్లో నిర్బంధింస్తున్నారని అన్నారు. పౌరహక్కుల నాయకులను, ప్రగతిశీల భావాలున్న వారైనా గోవిందు పన్సారే, కల్బురుగి, గౌరీ లంకేష్లను దారుణంగా హత మార్చారన్నారు, రాజ్యాంగం పొందుపరిచిన సోష లిజం పదానికి తూట్లు పొడుస్తుందని అసమానతలకు బీ జం వేస్తుందన్నారు. ఆదాని లాంటి అవినీతి కార్పొరేట్ సం స్థలకు అండగా ఉంటూ సంవత్సరానికి 2 లక్షల కోట్ల పన్ను తగ్గించారన్నారు. ఉపాధిహామీ పథకానికి కేటాయిం చే రూ.90000 కోట్లు బడ్జెట్ ను కుదించి 60 వేల కోట్లకు తగ్గించారన్నారు, ప్రయివేటీకరణ పేర్లు రిజిస్ట్రేషన్ హక్కు లు కూడా తీసివేస్తున్నారన్నారు, డీజిల్, పెట్రోల్ వంట గ్యాస్ ధరలు పెంచి కార్పొరేట్ సంస్థల ఆస్తులు వేల కోట్లు సంపాదించుకునేలా బీజేపీ ప్రభుత్వం ఊడిగం చేస్తుంద న్నారు. కార్యక్రమంలో ఎండి మహమ్మద్, ముతుల రా జు, శ్యాంసుందర్, ముస్తఫా, వెంకటప్ప, శ్రీనివాస్, లక్ష్మణ్, మల్లప్ప, రఫీ తదితరులు పాల్గొన్నారు.